హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.
Panchayat: సినిమాగా రాబోతున్న మరో బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్.. మీర్జాపూర్ దారిలోనే పంచాయత్!
Panchayat: ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'పంచాయత్' త్వరలోనే సినిమాగా రాబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు. సోమవారం (నవంబర్ 23) మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో జరిగిన 'పంచాయత్ సీజన్ 5' ట్రైలర్ లాంచ్ వేడుకలో టీవీఎఫ్ (TVF) ప్రెసిడెంట్ విజయ్ కోషి ఈ ఆసక్తికర ప్రకటన చేశారు.
Panchayat: ఇండియన్ ఓటీటీ రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. ఇప్పటివరకు థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీలోకి రావడం చూశాం.. కానీ ఇప్పుడు ఓటీటీలో బ్లాక్‌బస్టర్ అయిన వెబ్ సిరీస్‌లు ఏకంగా సిల్వర్ స్క్రీన్‌పై సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో హిట్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్' (Mirzapur: The Movie) థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో భారతదేశపు మోస్ట్ లవ్డ్ వెబ్ సిరీస్ 'పంచాయత్' (Panchayat) కూడా వెండితెరపైకి రాబోతోంది. 2016 నుంచే తమకు 'పంచాయత్'ను సినిమాగా తీయాలనే కల ఉందని, పూర్తి తారాగణంతో త్వరలోనే బిగ్ స్క్రీన్‌పైకి వస్తామని మేకర్స్ వెల్లడించారు.
భోపాల్ వేదికగా మేకర్స్ క్రేజీ అనౌన్స్‌మెంట్
సోమవారం (నవంబర్ 23) మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో ఉన్న మహోడియా గ్రామంలో 'పంచాయత్ సీజన్ 5' (Panchayat Season 5) ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 'పంచాయత్' నిర్మాణ సంస్థ ది వైరల్ ఫీవర్ (TVF) ప్రెసిడెంట్ విజయ్ కోషి సినిమా అడాప్టేషన్‌పై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
“ప్రతి స్టోరీ టెల్లర్ అంతిమ గమ్యం వెండితెర. నిజం చెప్పాలంటే 'మీర్జాపూర్' సినిమా చూశాక మాకు ఈ ఆలోచన రాలేదు. 2016లోనే మేము 'పంచాయత్' కథను సినిమాగా తీయాలని అనుకున్నాం. మేము ఇప్పటివరకు 50 షోలు, ఎంతో పాపులారిటీ సంపాదించినప్పటికీ, ఒక కథకు అసలైన పరీక్ష జరిగేది సినిమా హాళ్లలోనే” అని విజయ్ కోషి అన్నారు.
“ఖచ్చితంగా 'పంచాయత్'ను సినిమాగా థియేటర్లలోకి తీసుకువస్తాం. ఈ సిరీస్‌లో నటించిన నటీనటులందరూ ఆ సినిమాలోనూ భాగమవుతారని, త్వరలోనే 'పంచాయత్: ది మూవీ'ని బిగ్ స్క్రీన్‌పై చూస్తామని ఆశిస్తున్నాను” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 3న 'పంచాయత్ సీజన్ 5' స్ట్రీమింగ్
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, ఫైజల్ మాలిక్, అశోక్ పాఠక్, సునీతా రాజ్‌వర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పంచాయత్' తొలి సీజన్ 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్ సమయంలో విడుదలై అద్భుత విజయం సాధించింది.
ఫులేరా గ్రామంలోని అమాయకపు ప్రజలు, వారి మధ్య ఉండే ఆప్యాయతలు, గ్రామ పంచాయతీ రాజకీయాల చుట్టూ సాగే ఈ సిరీస్ ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ హెడ్ మనీష్ మెంఘానీ సమక్షంలో విడుదలైన ‘పంచాయత్ సీజన్ 5’ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త సీజన్ లో కొత్త ప్రధాన్ జీ సారథ్యంలో సచివ్ జీ ఎదుర్కోబోతున్న సమస్యలు, సవాళ్లు, రింకీతో సాగే లవ్ స్టోరీలాంటి వన్నీ ఈ ట్రైలర్లో చూడొచ్చు.
ఈ కొత్త సీజన్ డిసెంబర్ 3, 2026న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో సీజన్ 5 సందడి ముగిసిన తర్వాత, ఫులేరా గ్యాంగ్ థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి.

E-Paper
