OTT Release: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన మీర్జాపూర్ మూవీ- ఏకంగా మూడున్నర గంటల రన్ టైమ్- కొత్త సీన్లతో ఎక్కడ చూడాలంటే?
OTT Release: భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'మీర్జాపూర్ ద మూవీ' ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎక్స్టెండెడ్ కట్ స్ట్రీమింగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీ స్టోరీ, రన్ టైమ్ తదితర పూర్తి వివరాలు మీకోసం.
OTT Release: హిందీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ అయిన 'మీర్జాపూర్'కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే 'మీర్జాపూర్ ది మూవీ'. సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఏకంగా రూ.336 కోట్లకు పైగా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఓటీటీలోకి మీర్జాపూర్ మూవీ
ఇప్పుడు ఈ సూపర్ హిట్ గ్యాంగ్ స్టర్ డ్రామా మీర్జాపూర్ మూవీ ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో దీపావళి కానుకగా పండుగకు ముందే ఈ రోజు (అక్టోబర్ 30) నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అంతే కాకుండా ఎక్స్టెండెడ్ కట్ తో సర్ ప్రైజ్ చేసింది.
రన్ టైమ్ ఎంతంటే?
సాధారణంగా థియేటర్లో రిలీజైన వెర్షన్ కు, ఓటీటీలో వచ్చే వెర్షన్ కు కొద్దిగా తేడా ఉంటుంది. సెన్సార్ బోర్డ్ (CBFC) మీర్జాపూర్ మూవీ థియేట్రికల్ రిలీజ్ సమయంలో కొన్ని అభ్యంతరకరమైన, ఇంటిమేట్ సీన్స్, బూతు పదాలను కట్ చేసింది. కానీ, ఓటీటీలో మాత్రం మేకర్స్ ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా నేరుగా ‘ఎక్స్టెండెడ్ కట్’ ను ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.
ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ నిడివి ఏకంగా 3 గంటల 31 నిమిషాలు ఉండటం విశేషం. అంటే దాదాపు మూడున్నర గంటల పాటు ప్రేక్షకులకు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ విందు దొరకనుంది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ భాషలో స్ట్రీమ్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే?
ఈ సినిమా కథ మీర్జాపూర్ సిరీస్ మొదటి సీజన్ సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. సిరీస్ లో తమదైన డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు పండిట్), దివ్యేందు (మున్నా భయ్యా) పాత్రలు ఈ సినిమాలోనూ తమ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.
ఎందుకు చూడాలి?
మీర్జాపూర్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, ఇప్పుడు ఇంట్లోనే ప్రైమ్ వీడియోలో ఈ 'ఎక్స్టెండెడ్ కట్' ను చూసి థ్రిల్ ఫీల్ అవ్వొచ్చు. సిరీస్ తో సంబంధం లేకుండా నేరుగా మూవీ చూసే వాళ్లకు కూడా ఈ ఆధిపత్య పోరు, పాలిటిక్స్ స్టోరీ అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్ బస్టర్ మూవీని వెంటనే చూసేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


