KTR Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. వీళ్లు కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతారట అంటూ.. వీడియో వైరల్

KTR Prabhas: కేటీఆర్, ప్రభాస్ ప్రాంక్ కాల్ ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది అండర్ 18 వరల్డ్ పాడ్‌కాస్ట్ షోలో భాగంగా రెబల్ స్టార్ కు కేటీఆర్ కాల్ చేయడం, పిల్లలు సరదాగా మాట్లాడటం ఈ వీడియోలో చూడొచ్చు.

Published on: Sep 11, 2026, 15:44:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

KTR Prabhas: పిల్లల ముచ్చట తీర్చడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) టాలీవుడ్ స్టార్లకు వరుసగా ఫోన్ కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'ది అండర్ 18 వరల్డ్' అనే టాక్ షోలో పాల్గొన్న కేటీఆర్.. ప్రభాస్, మహేష్ బాబు, నాని లాంటి డార్లింగ్స్‌కు లైవ్‌లోనే ప్రాంక్ కాల్స్ చేశారు. మొదట ఎవరూ లిఫ్ట్ చేయకపోయినా, ఆ తర్వాత గ్లోబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన రిటర్న్ కాల్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

KTR Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. వీళ్లు కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతారట అంటూ.. వీడియో వైరల్
KTR Prabhas: డార్లింగ్ ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. వీళ్లు కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతారట అంటూ.. వీడియో వైరల్

పిల్లల కోసం మైక్ పట్టిన కేటీఆర్.. రచ్చ రచ్చ చేసిన బుడతలు

'ది అండర్ 18 వరల్డ్' షోకి గెస్ట్‌గా వచ్చిన కేటీఆర్ పిల్లలతో చాలా సరదాగా గడిపారు. టాక్ షోలో భాగంగా బుడతలు కేటీఆర్‌ను ఒక క్రేజీ రిక్వెస్ట్ అడిగారు. తమకిష్టమైన టాలీవుడ్ హీరోలతో మాట్లాడించాలని పట్టుబట్టారు.

పిల్లల ముచ్చట కాదనలేక కేటీఆర్ వెంటనే తన ఫోన్ తీసి స్టార్ హీరోలకు వరసబెట్టి కాల్స్ చేయడం ప్రారంభించారు. మొదట ప్రిన్స్ మహేష్ బాబు, ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, అలాగే రెబెల్ స్టార్ ప్రభాస్‌కి ప్రయత్నించారు.

కట్ చేస్తే... డార్లింగ్ ప్రభాస్ నుంచి రివర్స్ కాల్

కేటీఆర్ కాల్ చేసిన టైమ్‌లో స్టార్స్ ఎవరూ ఫోన్ ఎత్తలేదు. షూటింగ్స్, పర్సనల్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కాల్ కనెక్ట్ కాలేదు. దీంతో పిల్లలు కాస్త డిసప్పాయింట్ అయ్యే మూడ్‌లోకి వెళ్లారు.

అయితే కొద్దిసేపటికే అసలైన ట్విస్ట్ పడింది. ఫోన్ రింగ్ అవ్వడం చూసి కేటీఆర్ స్క్రీన్ చెక్ చేస్తే.. అక్కడ కనిపించింది మన 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ నేమ్. కేటీఆర్ మిస్డ్ కాల్ చూసి ప్రభాస్ వెంటనే తిరిగి కాల్ చేశారు.

ప్రభాస్ స్వీట్ రెస్పాన్స్.. ఫిదా అయిన ఫ్యాన్స్

అయితే ఆ కాల్ మాట్లాడిన ఓ అమ్మాయి ఈ ఫోన్ తనకు రోడ్డుపై దొరికిందని, తాను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా అని అడిగింది. అది విన్న ప్రభాస్ కాల్ కట్ చేశాడు. తర్వాత కేటీఆర్ కాల్ చేసి డార్లింగ్ కు జరిగిన విషయం చెప్పారు. ఎవరైనా సూపర్ స్టార్ కు కాల్ చేయాలని అడిగితే నీకు చేశానని, నిన్ను నేరుగా కలిస్తే వాళ్లు కాళ్లు పట్టుకొని క్షమించమని అడగాలని అనుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పడం నవ్వులు పూయించింది.

అంతేకాదు ఈ పిల్లలు మీతో కలవాలని అనుకుంటున్నారని కేటీఆర్ అడిగితే.. రెబెల్ స్టార్ ఓకే చెప్పారు. ప్రభాస్ ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా, ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ మాత్రం ఎప్పటికీ మారదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్ లోని ఈ ఫ్రెండ్లీ, ప్రాంకిష్ యాంగిల్ చూడటం చాలా కొత్తగా ఉందంటూ రీల్స్, షార్ట్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రభాస్ క్రేజ్.. కేటీఆర్ డిజిటల్ జోష్

ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతోపాటు ఫౌజీ కూడా రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 3న థియేటర్లలోకి వస్తుందని చెప్పినా.. మరుసటి రోజే వృషకర్మ రిలీజ్ కానుండటంతో ఫౌజీ డేట్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కేటీఆర్ తరచూ యువతతో, పిల్లలతో కనెక్ట్ అయ్యే డిజిటల్ ఈవెంట్లలో పాల్గొంటూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ ప్రాంక్ కాల్ వీడియోతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ క్యాడర్, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More