Vishwanath and Sons Collections: ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ బ‌ద్ద‌లు.. అమెరికాలో విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ రికార్డు.. సూర్య హవా

Vishwanath and Sons Collections: కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్ లోనూ మోత మోగిస్తోంది. యూఎస్‌ఏ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

Published on: Aug 20, 2026, 12:18:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishwanath and Sons Collections: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో అదరగొడుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.

ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ బ‌ద్ద‌లు.. అమెరికాలో విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ రికార్డు.. సూర్య హవా (x/SitharaEnts)
ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ బ‌ద్ద‌లు.. అమెరికాలో విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ రికార్డు.. సూర్య హవా (x/SitharaEnts)

విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్లు

తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అమెరికా మార్కెట్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' 2 మిలియన్ డాలర్ల ($2 Million Gross) వసూళ్ల మైలురాయిని దాటింది.

రూ. 200 కోట్ల దిశగా

అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేట్రికల్ రన్‌లో అత్యంత వేగంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. సూర్య నటనలోని పరిణతికి, వెంకీ అట్లూరి స్టోరీ లైన్ కు ఈ బాక్సాఫీస్ రికార్డులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. సినిమా ఎక్కడా జోరు తగ్గడం లేదు.

యాక్టింగ్ అదుర్స్

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో నటించిన ప్రధాన నటీనటుల నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోయిన్ మమితా బైజు, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ తమ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారని సినీ విమర్శకులు, ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్, నటుడు హర్ష చెముడు, భవానీ శ్రీ తదితరులు తమ పాత్రలలో ఒదిగిపోయి సినిమా విజయానికి కీలక బలంగా నిలిచారు. అందుకే ఈ సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది.

ఆకట్టుకున్న సంగీతం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ ఫ్యామిలీ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

థియేటర్లలో రన్ ఇంకా బలంగా ఉండటంతో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే రూ.200 కోట్ల మార్కును చేరబోతుంది. ఇంకా ఈ మూవీ రికార్డుల వేట కొనసాగించే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More