మంచి సినిమాలకు దూరమవుతారు జాగ్రత్త.. దాక్కోకుండా సపోర్ట్ చేయండి.. వారం ముందుగానే మూవీ ప్రీమియర్.. తాప్సీ సంచలన పోస్ట్

'అస్సీ' మూవీతో బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను మరోసారి థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రచారాన్ని స్టార్ట్ చేసిన తాప్సీ.. ఇన్ స్టాలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. రియల్ స్టోరీలకు సపోర్ట్ చేయాలని కోరింది.  

Published on: Feb 12, 2026, 13:31:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను లీడ్ రోల్ ప్లే చేసిన అప్ కమింగ్ మూవీ ‘అస్సీ’. ఈ హిందీ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లకు రాబోతుంది. అంతకంటే ఒక వారం ముందే స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజమైన రియల్ స్టోరీస్ కు సపోర్ట్ చేయండి, దాక్కోకండి అంటూ తాప్సీ సంచలన పోస్టు పెట్టింది.

అస్సీ సినిమాలోని స్టిల్ లో తాప్సీ
అస్సీ సినిమాలోని స్టిల్ లో తాప్సీ

తాప్సీ పోస్టు

అస్సీ మూవీ రిలీజ్ నేపథ్యంలో తాప్సీ పన్ను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వైరల్ గా మారింది. హిందీ సినిమాలో మూలాలున్న అర్థవంతమైన కథలు రావని నిందించడం మానేసి, రియల్ స్టోరీలను ఎంకరేజ్ చేయాలని తాప్సీ కోరింది. సాకులు చెప్పి దాక్కోకుండా, మంచి సినిమాలకు సపోర్ట్ గా నిలవాలని చెప్పింది.

దాక్కోకండి

‘‘ఈ సారి మాత్రం లోతుగా మూలాలున్న రియల్ స్టోరీలను హిందీ సినిమా చూపించదనే సాకుతో దాక్కుకోండి. మీకు సినిమాను అందించడం కోసం శాయాశక్తుల పనిచేస్తున్న మేకర్స్ కృషిని పట్టించుకోకుండా తెరల వెనుక దాక్కోకండి. ఇలాంటి కథలను థియేటర్లకు తీసుకురాడం వెనుక అసమర్థత కాదు సోమరితనం ఉందని దాక్కోకండి’’ అని తన పోస్టులో తాప్సీ రాసుకొచ్చింది.

ప్రపంచ సినిమాతో పోటీ

‘‘ప్రపంచ సినిమాతో మనం పోటీ పడాలంటే మన కథలను, రియల్ స్టోరీలను సపోర్ట్ చేయండి. కాలాన్ని మారుద్దాం. ఎందుకంటే కేవలం సినిమా తెరకెక్కించి రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. మన కథలకు విలువ ఇచ్చినప్పుడే మంచి సినిమా చూసేందుకు అర్హత ఉంటుంది’’ అని తాప్సీ పేర్కొంది.

మంచి సినిమాలకు దూరం

‘‘సమాజం త్వరలో మంచి సినిమాలకు దూరమవుతుంది. ఎందుకంటే మనం నిరంతరం నాసిరకాన్ని ప్రశ్నించడమే కాదు, ఉన్నతమైన దాని కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు సైలెంట్ గా ఉండటమే కారణం. మా మూవీ అఫీషియల్ రిలీజ్ కంటే వారం ముందుగానే మీ ప్రేమ, నమ్మకాన్ని పొందేందుకు స్పెషల్ స్క్రీనింగ్ అవుతుంది’’ అని తాప్సీ పోస్టు చేసింది.

ఫ్యాన్స్ రియాక్షన్

తాప్సీ పోస్టు పట్ల అభిమానుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. "మీ సినిమా నిజంగా చూడటానికి అర్హమైంది.ఇందులో ఒక రకమైన ఉత్కంఠ, అద్భుతం ఉంది’’ అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. "అద్భుతమైన తాప్సీ.. చాలా బాగా చెప్పారు. సరిగ్గా చెప్పారు" అని మరొకరు పేర్కొన్నారు. ‘‘నా ప్రేమ మొత్తం మీకే’’ అని మరో యూజర్ తాప్సీపై అభిమానం కురిపించాడు.

అస్సీ మూవీ కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఇది ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More