Taapsee Pannu: ఫ్లాట్ బెల్లీ కోసం శరీరాన్ని హింసించా.. ఇన్‌స్టాగ్రామ్ పిక్స్ కోసం ఆ తప్పు చేయకండి.. తాప్సీ వార్నింగ్

Taapsee Pannu: సినిమా స్టార్లలా పర్‌ఫెక్ట్‌గా కనిపించాలనే ఒత్తిడితో తన శరీరాన్ని ఎలా హింసించుకున్నానో వివరిస్తూ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చేసింది. లోయర్ బెల్లీ ఫ్యాట్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వివరిస్తూ మహిళలకు వార్నింగ్ ఇచ్చింది.

Published on: Jun 1, 2026, 12:03:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Taapsee Pannu: సోషల్ మీడియా యుగంలో పర్‌ఫెక్ట్ బాడీ షేప్‌తో, ముఖ్యంగా 'ఫ్లాట్ బెల్లీ' (సన్నని నడుము) తో కనిపించాలనే ఒత్తిడి సెలబ్రిటీలకే కాదు, సామాన్య అమ్మాయిలకూ ఎక్కువే ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది కఠినమైన డైట్లు, మితిమీరిన వర్కవుట్లతో తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. తాజాగా దీనిపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చే'సింది.

ఫ్లాట్ బెల్లీ కోసం శరీరాన్ని హింసించానని తాప్సీ సంచలన కామెంట్లు
ఫ్లాట్ బెల్లీ కోసం శరీరాన్ని హింసించానని తాప్సీ సంచలన కామెంట్లు

పర్‌ఫెక్ట్ బాడీ ఇమేజ్

ఒకప్పుడు పర్‌ఫెక్ట్ బాడీ ఇమేజ్ కోసం తానూ శరీరాన్ని విపరీతంగా హింసించుకున్నానని, ఆ తప్పును అభిమానులు ఎవరూ చేయవద్దని తాప్సీ వార్నింగ్ ఇచ్చింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడొద్దని హితవు పలికింది.

చాలా ఫిట్ గా

"చిన్నప్పటి నుంచి నేను చాలా ఫిట్‌గా ఉండేదాన్ని. కానీ లోయర్ బెల్లీ ఫ్యాట్ ఎందుకు అలాగే ఉండిపోతుందో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. దానిని కరిగించడం కోసం నా శరీరాన్ని మోయలేని శక్తికి మించి కష్టపెట్టాను.

ఎప్పుడైతే మనం శరీరాన్ని పరిమితికి మించి శ్రమింపజేస్తామో, అప్పుడు మెదడు అలర్ట్ అవుతుంది. శరీరాన్ని రక్షించుకోవాలనే హెచ్చరిక సంకేతాలను పంపుతుంది" అని తాప్సీ పేర్కొంది.

కొవ్వు మాత్రమే కాదు

"మనం మితిమీరి శ్రమించినప్పుడు శరీరం నుంచి నీరు బయటకు పోవడానికి బదులు, లోపలే పేరుకుపోవడం (వాటర్ రిటెన్షన్) మొదలవుతుంది. ఆ సమయంలో పొత్తికడుపు భాగంలో కనిపించేది కేవలం కొవ్వు మాత్రమే కాదు, అది వాటర్ రిటెన్షన్ కూడా కావచ్చు.

అతిగా వర్కవుట్లు చేయడం వల్ల అది తగ్గకపోగా, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా జిమ్‌లలో శరీరాన్ని అంతగా హింసించకూడదని నేను నమ్ముతున్నాను" అని తాప్సీ అభిమానులకు సూచించింది.

నిజాన్ని అంగీకరించాలి

"ఇతర అమ్మాయిల లాగే మన శరీరమూ ఉండాలనుకోవడం తప్పు, ఆ నిజాన్ని మనం అంగీకరించాలి. ఈ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా, నా శరీరాన్ని ఎంతో హింసించుకున్న తర్వాత తెలుసుకున్నాను. కొన్ని రోజులు నడుము సన్నగా కనిపిస్తుంది, కొన్ని రోజులు అలా కనిపించదు. పొత్తికడుపు కింద కొద్దిగా కొవ్వు, వాటర్ రిటెన్షన్ ఉండటం చాలా అవసరమని నా న్యూట్రిషనిస్ట్ మున్‌మున్ గనేరివాల్ నాకు వివరించారు.

ఎందుకంటే అక్కడే స్త్రీల పునరుత్పత్తి అవయవాలు (రిప్రొడక్టివ్ ఆర్గాన్స్) ఉంటాయి. వాటికి రక్షణ అవసరం. మహిళగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆ రక్షణ ప్రకృతి సిద్ధంగానే లభిస్తుంది" అని తాప్సీ వివరించింది. పొత్తికడుపు భాగంలో కొద్దిగా కొవ్వు ఉండటం ఆరోగ్యకరమైన లక్షణం. కేవలం ఫోటోల కోసం మిమ్మల్ని మీరు హింసించుకోకండి" అని తాప్సీ తెలిపింది.

తాప్సీ సినిమాలు

తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇటీవలే 'అస్సి' (Assi) అనే చిత్రంలో కనిపించింది. ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో కని కుస్రుతి, రేవతి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, మహ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

ప్రస్తుతం తాప్సీ తన తదుపరి చిత్రం 'గాంధారి' (Gandhari) విడుదలకు సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. కథా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కనికా ధిల్లాన్ ఈ చిత్రానికి కథను అందించడంతో పాటు స్వయంగా నిర్మించారు. కిడ్నాప్‌నకు గురైన తన బిడ్డ కోసం ఒక తల్లి చేసే పోరాటమే ఈ సినిమా కథాంశమని చిత్ర బృందం తెలిపింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న 1: తాప్సీ పన్ను లోయర్ బెల్లీ ఫ్యాట్ గురించి ఏం చెప్పింది?

సమాధానం: పొత్తికడుపు భాగంలో కొద్దిగా కొవ్వు ఉండటం మహిళల ఆరోగ్యానికి, పునరుత్పత్తి అవయవాల రక్షణకు ఎంతో అవసరమని, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల కోసం శరీరాన్ని హింసించవద్దని తాప్సీ చెప్పింది.

ప్రశ్న 2: అతిగా వర్కవుట్లు చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది?

సమాధానం: పరిమితికి మించి వర్కవుట్లు చేసినప్పుడు శరీరం నీటిని లోపలే నిలిపి ఉంచుతుంది (వాటర్ రిటెన్షన్). దీనివల్ల పొత్తికడుపు భాగంలో కొవ్వు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉందని తాప్సీ వివరించింది.

ప్రశ్న 3: తాప్సీ నటించిన 'గాంధారి' సినిమా ఏ ఓటీటీలో రానుంది?

సమాధానం: తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాంధారి' చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ ఏడాది విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More