Taiwan Actor Indian Girl: ఒక్క చూపులో ఇండియన్ అమ్మాయికి పడిపోయిన తైవాన్ నటుడు- కారణం తెలిస్తే భారతీయులు గర్వపడాల్సిందే!
Taiwan Actor Cheng Chang Fan Indian Girl Love Story: ఇండియన్ హోటల్‌లో పని చేసే భారతీయ యువతితో ఒక్క చూపులోనే ప్రేమలో పడిపోయాడు తైవాన్ నటుడు చెన్ చాంగ్ ఫాన్. ప్రస్తుతం వీరిద్దరి రొమాంటిక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెను చెన్ ప్రేమించడానికి గల కారణం భారతీయులను గర్వపడేలా చేస్తోంది.
Taiwan Actor Cheng Chang Fan Indian Girl Love Story: తొలిచూపులోనే ప్రేమలో పడటం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో కూడా అలాంటి అరుదైన దృశ్యం పునరావృతమైతే సోషల్ మీడియా ఊరుకుంటుందా? సరిగ్గా ఇదే తరహా సంఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.

హోటల్ స్వాగతం నుంచి విదేశీ ప్రయాణం వరకు
ఒక విదేశీ నటుడు భారతీయ సంప్రదాయ ఆహ్వానానికి ముగ్ధుడై, ఇక్కడి అమ్మాయితో ప్రేమలో పడిన సంఘటన ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తైవాన్‌కు చెందిన ప్రముఖ నటుడు, మోడల్ చెంగ్ చాంగ్ ఫాన్ 2025లో భారత్ సందర్శించిన సమయంలో ఒక హోటల్‌లో విడిది చేశారు.
అక్కడ పనిచేసే ఒక భారతీయ యువతి సాంప్రదాయబద్ధంగా హారతి ఇస్తూ, నుదుట తిలకం దిద్ది ఆయనకు సాదర స్వాగతం పలికింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య నడిచిన చిరునవ్వుల సంభాషణను చెంగ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, లక్షలాది మంది వీక్షించారు.
అనూహ్య మలుపు తిరిగిన స్టోరీ
ఆ కళ్లలోని మెరుపు చూసి వీరి మధ్య ఏదో ప్రత్యేకమైన అనుబంధం మొదలైందని అప్పట్లోనే నెటిజన్లు భావించారు. సరిగ్గా ఏడాది తర్వాత ఈ కథ అనూహ్య మలుపు తిరిగింది. ఆ భారతీయ యువతిని విదేశాలకు రప్పించి, ఆమెను గాల్లో తిప్పుతూ కౌగిలించుకున్న వీడియోను చెంగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు.
"అలా అతి సులువుగా.. ఆమెను ఏకంగా ప్రపంచం అవతలి ఒడ్డు నుంచి నా కౌగిల్లోకి తీసుకొచ్చాను" అని చెంగ్ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకోవడం ప్రారంభించారు. కేవలం వీడియోతోనే ఆగకుండా, ఆ యువతితో దిగిన అందమైన ఫొటోలను పంచుకుంటూ భారతీయ మహిళలపై చెంగ్ ఒక భావోద్వేగ నోట్ రాసుకొచ్చారు.
భారతీయ స్త్రీల ప్రేమాభిమానాలపై ప్రశంసలు
"భారతీయ మహిళల అందం కేవలం కంటికి కనిపించేదాంట్లోనే ఉండదు. అది మనం పొందే అనుభూతిలో ఉంటుంది. వారు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, గాఢమైన నిబద్ధతను చూపుతారు, మనస్ఫూర్తిగా నవ్వుతారు. ప్రపంచం ఎంత కఠినంగా మారమన్నా వారు తమలోని సున్నితత్వాన్ని కోల్పోరు". అని చెంగ్ చాంగ్ ఫాన్ రాసుకొచ్చాడు.
"మొదటి రోజు ఆ హోటల్‌లో అడుగుపెట్టిన క్షణమే ఆ కళ్లలోని నిజాయితీని, వెలుగును నేను గ్రహించాను. దేవుడు నా వైపే ఉన్నాడనిపించింది. ధన్యవాదాలు భారత్" అని చెంగ్ చాంగ్ ఫాన్ కొనియాడారు.
మన దేశపు ఆప్యాయతలకు ఫిదా
ఈ వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, ఆతిథ్యం గొప్పతనాన్ని మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాయి. మన దేశపు అప్యాయతలకు విదేశీయులు ఎంతలా దాసోహమవుతారో ఈ సంఘటన నిరూపిస్తోంది.
ఇంతకీ ఎవరీ చెంగ్ చాంగ్ ఫాన్?
తైపీకి చెందిన చెంగ్ చాంగ్ ఫాన్ అంతర్జాతీయ మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందారు. లండన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన ఆయన డయోర్, హ్యూగో బాస్, బర్‌బెర్రీ వంటి అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహరించారు.
2020లో వచ్చిన ‘క్రేవింగ్ యూ’ డ్రామా ద్వారా నటుడిగా పాపులర్ అయ్యారు. 2022లో ‘ఏంట్ నథింగ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో గాయకుడిగానూ రాణించారు. అటు మోడలింగ్, ఇటు నటనతో పాటు తైపీలో 'చెంగ్ అండ్ మాచ్' పేరిట పూల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి లవ్ స్టోరీపై ఇరువైపులా అధికారిక ప్రకటన రానప్పటికీ, నెటిజన్లు మాత్రం ఈ రీల్-లైఫ్ తరహా రియల్ లవ్ స్టోరీకి ఫిదా అవుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


