...
...
Next Story

ఈ సినిమా చేయడానికి తమన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా నటించిన 'ఓ రోమియో' మూవీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో నటించిన స్టార్ నటులు తమన్నా భాటియా, విక్రాంత్ మస్సీ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని దర్శకుడు స్వయంగా వెల్లడించాడు.

Published on: Feb 9, 2026, 16:47:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్, స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమా 'ఓ రోమియో' (O Romeo). ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే ముందు రోజు విడుదలవుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిశా పటాని, అవినాష్ తివారీ, నానా పటేకర్ వంటి స్టార్లు ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇందులో కీలక పాత్రలు పోషించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, హీరో విక్రాంత్ మస్సీ ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారట.

విక్రాంత్ మస్సీ ఇచ్చిన మాట..

ఈ సినిమా చేయడానికి తమన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ సినిమా చేయడానికి తమన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

'12th ఫెయిల్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సీ.. ఇప్పుడు పెద్ద స్టార్. కానీ అతను స్టార్ కాకముందే, అప్పుడప్పుడే అవకాశాల కోసం చూస్తున్న రోజుల్లో విశాల్ భరద్వాజ్‌కు ఈ సినిమా చేస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు స్టార్ ఇమేజ్ వచ్చినా, ఆ పాత మాటను నిలబెట్టుకుని రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాడు. విశాల్ భరద్వాజ్ తీసిన 'మక్బూల్' (Maqbool) సినిమా చూసే తాను ఇండస్ట్రీకి వచ్చానని, ఆ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని విక్రాంత్ చెప్పాడు. అందుకే ఈ సినిమాలో 8 నుంచి 9 రోజుల పాటు ఉచితంగా పనిచేశానని విక్రాంత్ తెలిపాడు.

బడ్జెట్ లేదని చెబితే.. తమన్నా గొప్ప మనసు

ఇక మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విషయానికి వస్తే.. ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. కథలో వచ్చే ఒక ప్రధానమైన ట్విస్ట్ ఆమె పాత్ర ద్వారానే రివీల్ అవుతుంది. సినిమా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వలేమని చెప్పినప్పుడు, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా నటించడానికి ఒప్పుకుంది.

కేవలం నటించడమే కాదు, తన పాత్ర కోసం వర్క్‌షాప్‌లు, రిహార్సల్స్‌లో కూడా పాల్గొందట. అనుకున్న దానికంటే ఎక్కువగా దాదాపు 12 రోజుల పాటు ఆమె షూటింగ్‌ చేసింది. తమన్నా, విక్రాంత్ చూపిన ఈ దాతృత్వం సినిమాపై చెరగని ముద్ర వేసిందని దర్శకుడు కొనియాడాడు.

హ్యాట్రిక్ హిట్ కాంబో, కోర్టు వివాదం

మరోవైపు ఈ సినిమా ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా (Hussain Ustara) జీవితం ఆధారంగా తెరకెక్కినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ ఇబ్రహీంతో గొడవపడ్డ గ్యాంగ్‌స్టర్ ఇతను. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు సమాచారం. అయితే, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ హుస్సేన్ ఉస్తారా కుమార్తె కోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు చూపనందున కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks