Tamannaah Siddharth: కన్నడ సూపర్ స్టార్ యశ్ సరసన 'టాక్సిక్' సినిమాలో కియారా అద్వానీ చేసిన ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ సోషల్ మీడియాలో ఎంత పెద్ద దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కియారా భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో లిప్ కిస్ ఇస్తున్న ఒక వీడియో నెట్టింట ప్రత్యక్షమై తెగ హల్‌చల్ చేస్తోంది.
క్లారిటీ ఇచ్చిన నెటిజన్లు.. అసలు నిజమేంటంటే?

నెటిజన్లు కొందరు ఈ వీడియో చూసి "కియారా కిస్ సీన్స్‌కి సిద్ధార్థ్ ఇలా రివెంజ్ తీర్చుకున్నాడా?" అని షాక్ తిన్నారు. మరికొందరైతే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'ది వాన్' (The Vvaan) లోని రొమాంటిక్ సీన్ ఇది అని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు.
అయితే ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న షాకింగ్ నిజం ఏంటంటే.. ఇది పూర్తిగా ఏఐ (AI) సాయంతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియో. ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అందులో గ్రోక్ ఏఐ (Grok AI) వాటర్‌మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు "ఇది కిస్సింగ్ కాంపిటీషన్ కాదు బాస్.. ఏఐ జనరేషన్ కాంపిటీషన్" అని కామెంట్లు పెడుతున్నారు.
'టాక్సిక్' వర్సెస్ 'ది వాన్'.. బాక్స్ ఆఫీస్ క్లాష్ అందుకే క్యాన్సిల్
నిజానికి సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా జంటగా 'ది వాన్' అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. దీపక్ మిశ్రా, అరుణభ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట ఆగస్టు 28న థియేటర్లలోకి రావాల్సి ఉంది.
కానీ కియారా అద్వానీ, రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో తెరకెక్కిన 'టాక్సిక్' సినిమా ఆగస్టు 26న విడుదల కావడంతో.. భార్యాభర్తల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడకూడదని మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. 'ది వాన్' మూవీ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 25కి పోస్ట్‌పోన్ చేశారు.
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో 'ది వాన్'.. మిస్టరీ బిహైండ్ ద టెంపుల్
{{/usCountry}}కానీ కియారా అద్వానీ, రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో తెరకెక్కిన 'టాక్సిక్' సినిమా ఆగస్టు 26న విడుదల కావడంతో.. భార్యాభర్తల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడకూడదని మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. 'ది వాన్' మూవీ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 25కి పోస్ట్‌పోన్ చేశారు.
థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో 'ది వాన్'.. మిస్టరీ బిహైండ్ ద టెంపుల్
{{/usCountry}}'ది వాన్' కథ విషయానికొస్తే ఇది చాలా డిఫరెంట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తోంది. బీహార్‌లోని శతాబ్దాల నాటి ఒక మిస్టీరియస్ ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఆ గుడిలోకి సూర్యాస్తమయం తర్వాత ఎవరూ వెళ్లకూడదనే కఠినమైన నియమం ఉంటుంది. చివరికి ఆ గుడి పూజారి కూడా రాత్రి వేళ అక్కడ ఉండరు.
నగర వాతావరణంలో పెరిగిన సిద్ధార్థ్ ఆ నిషేధిత అడవిలోకి, దేవాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత గ్రామంలో ఎలాంటి వింత పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. ఒకవైపు క్యూరియోసిటీ పెంచుతున్న కథ, మరోవైపు నెట్టింట ఊహించని ఏఐ వీడియోల రచ్చతో సిద్ధార్థ్ - తమన్నాల 'ది వాన్' ఇప్పుడు నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.