...
...
Next Story

మెగాస్టార్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. మరోసారి ఐటెమ్ నంబర్‌లో మెరవనున్న తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పక్కన ఆమె ఐటెమ్ నంబర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆమె మెరవనున్నట్లు తెలుస్తోంది.

Published on: Nov 11, 2025, 21:01:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమన్నా ఈమధ్య వరుస ఐటెమ్ సాంగ్స్ లో మెరుస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడు మరోసారి చిరంజీవితో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీలో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవితో తమన్నా స్పెషల్ సాంగ్

మెగాస్టార్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. మరోసారి ఐటెమ్ నంబర్‌లో మెరవనున్న తమన్నా!
మెగాస్టార్ సినిమాలో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. మరోసారి ఐటెమ్ నంబర్‌లో మెరవనున్న తమన్నా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సమాచారం వైరల్ అవుతోంది. అదేమిటంటే స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ సినిమాలో ఒక స్పెషల్ డ్యాన్స్ నంబర్ కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. చివరిగా చిరంజీవి కూడా తమన్నాతోనే భోళా శంకర్ మూవీలో కనిపించాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో స్పెషల్ సాంగ్ ఆసక్తి రేపుతోంది.

స్పెషల్ సాంగ్స్ కేరాఫ్ తమన్నా

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన, మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కూడా తమన్నా ఒక ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తమన్నా.. ఇటీవల 'కావాలయ్యా కావాలయ్యా' వంటి సూపర్ హిట్స్ అందించింది. ఆమె ఎనర్జీ, డ్యాన్స్ మెగాస్టార్‌తో కలిసి మాస్ ప్రేక్షకులకు పక్కా ఫీస్ట్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారతోపాటు వెంకటేశ్, కేథరిన్ థ్రెసా కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ స్పెషల్ సాంగ్ కోసం అతడు ఒక పక్కా మాస్ నంబర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ ఫుల్-ఆన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి తన సినిమాల్లో స్టార్ హీరోల కామియోలు లేదా స్పెషల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తమన్నా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe