ఈ హారర్ మూవీలో న్యూడ్ సీన్లు లేవు కానీ బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయి.. స్కర్ట్ కిందికి లాగమన్నారు: హీరోయిన్ కామెంట్స్

తమిళ నటి ఆండ్రియా జెరేమియా తన నెక్ట్స్ హారర్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో న్యూడ్ సీన్లు లేవు కానీ.. బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని చెప్పింది. అంతేకాదు అంతటి సీనియర్ డైరెక్టర్ ఓ పాత్ర కోసం ఏదైనా అడిగితే చేస్తానని స్పష్టం చేసింది.

Published on: Nov 26, 2025, 17:35:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీ అని అంటుంటారు హీరోయిన్లు. తాజాగా తమిళ నటి ఆండ్రియా జెరేమియా కూడా అలాంటి కామెంట్సే చేసింది. తన నెక్ట్స్ హారర్ మూవీ పిశాచి 2 సినిమాలో న్యూడ్ సీన్లు ఉన్నాయా అన్నప్పుడు.. అవి లేకపోయినా ఎరోటిక్ సీన్లు మాత్రం చాలానే ఉన్నాయని చెప్పింది.

ఈ హారర్ మూవీలో న్యూడ్ సీన్లు లేవు కానీ బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయి.. స్కర్ట్ కిందికి లాగమన్నారు: హీరోయిన్ కామెంట్స్
ఈ హారర్ మూవీలో న్యూడ్ సీన్లు లేవు కానీ బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయి.. స్కర్ట్ కిందికి లాగమన్నారు: హీరోయిన్ కామెంట్స్

డైరెక్టర్‌ను నమ్మాల్సిందే

తమిళంతోపాటు తెలుగులోనూ వచ్చిన ఆకట్టుకున్న హారర్ థ్రిల్లర్ మూవీ పిశాచి. ఇప్పుడీ సినిమాకు పిశాచి 2 రూపంలో సీక్వెల్ వస్తోంది. మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఆండ్రియా స్పందించింది. ఈ సినిమాలో న్యూడ్, బోల్డ్ సీన్ల గురించి మాట్లాడింది. మిస్కిన్ లాంటి సీనియర్ డైరెక్టర్ ఓ పాత్ర కోసం ఏదైనా అడిగినప్పుడు అతన్ని నమ్మాల్సిందే అని ఆమె అనడం విశేషం.

“నిజానికి స్క్రిప్ట్ దశలో న్యూడ్ సీన్లు ఉన్నాయి. కానీ షూటింగ్ సమయంలో మిస్కిన్ సర్ వాటిని తీసేశాడు. దానికి కారణమేంటో నాకు తెలియదు. పిశాచి 2లో న్యూడిటీ లేదు. కానీ చాలా ఎరోటిక్ సీన్లు ఉన్నాయి. మిస్కిన్ సర్ ఈ సినిమాను ఏదో ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కోసం తీయడం లేదు. గతంలో అతడు ఎంతో మంది పెద్ద హీరోలతో తీశాడు. అలాంటి డైరెక్టర్ ఓ పాత్ర కోసం ఏదైనా చేయాలని అడిగితే అతన్ని విజన్‌ను నేను నమ్ముతాను. అతని ఉద్దేశం వేరే. గతంలో కొందరైతే నా స్కర్ట్ కిందికి లాగమని కూడా అన్నారు. వాళ్ల ఉద్దేశం వేరు” అని ఆండ్రియా చెప్పింది.

పిశాచి 2 మూవీ గురించి..

2014లో వచ్చిన పిశాచి సినిమాకు సీక్వెల్ గా ఈ పిశాచి 2 వస్తోంది. నిజానికి ఈ నెల మొదట్లోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో నటించారు. పిశాచి మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆండ్రియా ఇంటర్వ్యూతో ఈ సినిమా కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More