తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన శివకార్తికేయన్ నటించిన మూవీ అయలాన్. రెండేళ్ల కిందట అంటే 2024లో సంక్రాంతి సందర్భంగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించిందీ సినిమా. అయితే ఇప్పటి వరకూ తెలుగులో ఓటీటీలోకి రాలేదు. మొత్తానికి ఆహా వీడియో ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.
అయలాన్ ఓటీటీ రిలీజ్

శివకార్తికేయన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ పరాశక్తి ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. మరోవైపు ఇదే సమయంలో ఆహా వీడియో ఓటీటీ అతడు నటించిన అయలాన్ సినిమాను తెలుగులో బుధవారం (జనవరి 7) నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది.
“విధిని భవిష్యత్తు కలవబోతోంది.. అయలాన్ జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. మొత్తానికి రెండేళ్ల తర్వాత మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారా అంటూ ఫ్యాన్స్ ఈ పోస్టుకు కామెంట్స్ చేస్తున్నారు.
అయలాన్ కథ ఏదంటే?
అయలాన్ సినిమా 2024లో సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.83 కోట్లు వసూలు చేసింది. ఈ కథ విషయానికి వస్తే.. తామిజ్ (శివకార్తికేయన్) ఓ రైతు. జాబ్ కోసం సిటీకి వచ్చిన తామిజ్‌కు టాట్టూ అనే ఏలియన్‌తో ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. పెట్రోల్, డీజీల్‌కు ప్రత్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్). నోవా గ్యాస్‌ను వెలికితీయాడానికి స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తుంటాడు.
ఇండియాలో ఎవరికి తెలియకుండా ఓ మైన్‌లో రహస్యంగా నోవా గ్యాస్ ప్రయోగం చేస్తుంటాడు ఆర్యన్. ఈ ప్రమాదకరమైన ప్రయోగాన్ని అడ్డుకొని ఆర్యన్ దగ్గర ఉన్న స్పార్క్‌ను సొంతం చేసుకోవడానికి తన గ్రహం నుంచి టాట్టూ భూమిపైకి వస్తుంది. ఆర్యన్ ప్రయోగాన్ని అడ్డుకోవడంలో టాట్టూకు తామిజ్ ఎలాంటి సహాయం చేశాడు? ఈ ప్రయత్నంలో వీరిద్దరు ఎలాంటి కష్టాలు పడ్డారు? అన్నది యాక్షన్ అంశాలతో అయలాన్ మూవీలో చూపించాడు డైరెక్టర్ రవికుమార్.
అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించింది. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ అందించాడు. హీరో శివకార్తికేయన్‌తో పాటు సిద్ధార్థ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా కోసం పనిచేశాడు. అయలాన్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
{{/usCountry}}అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటించింది. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ అందించాడు. హీరో శివకార్తికేయన్‌తో పాటు సిద్ధార్థ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా కోసం పనిచేశాడు. అయలాన్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
{{/usCountry}}సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన అయలాన్ సినిమా షూటింగ్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు సాగింది. 2016లో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని 2024లో ఈ మూవీ రిలీజైంది.