తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్ బ్లాక్‌బస్టర్ మూవీ సిరాయ్ (Sirai). ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి రావడం విశేషం.
సిరాయ్ తెలుగు స్ట్రీమింగ్

విక్రమ్ ప్రభు లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ సిరాయ్. అంటే తెలుగులో జైలు అని అర్థం. దీనిని సోమవారం (జనవరి 26) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
“తమిళనాడును షాక్‌కు గురి చేసిన సినిమా. ఇప్పుడు తెలుగులో.. సిరాయ్ జీ5లో.. 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాను కేవలం తమిళంలోనే ఓటీటీలోకి తీసుకొచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు తెలుగులోనూ రావడంతో మూవీని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సిరాయ్ మూవీ గురించి..
సిరాయ్ ఓ తమిళ క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. దీనిని సురేష్ రాజకుమారి డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి మూవీ కావడం గమనార్హం. ఇందులో విక్రమ్ ప్రభుతోపాటు ఎల్కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమాను కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.31 కోట్లు వసూలు చేసింది. అన్ని వర్గాల నుంచి సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఐఎండీబీలనూ 8.4 రేటింగ్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా ఓ విచారణలో ఉన్న ఖైదీ, అతనికి కాపలాగా ఉండే ఓ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఖైదీని వెల్లూరు జైలు నుంచి శివగంగై కోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓ హత్య కేసులో నిందితుడితో ఆ కానిస్టేబుల్ చేసిన ఆ ప్రయాణం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందన్నదే ఈ సిరాయ్ మూవీ కథ. ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ పై మరింత ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}ఈ సినిమా ఓ విచారణలో ఉన్న ఖైదీ, అతనికి కాపలాగా ఉండే ఓ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఆ ఖైదీని వెల్లూరు జైలు నుంచి శివగంగై కోర్టుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఓ హత్య కేసులో నిందితుడితో ఆ కానిస్టేబుల్ చేసిన ఆ ప్రయాణం అతని జీవితాన్ని ఎలా మార్చేసిందన్నదే ఈ సిరాయ్ మూవీ కథ. ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ పై మరింత ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}