...
...
Next Story

హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్ స్టోరీ.. ఓటీటీలో దుమ్ము రేపుతున్న తమిళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

తమిళ క్రైమ్ డ్రామా సిరై (Sirai) ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తోంది. ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి మధ్య లవ్ స్టోరీని మనసుకు హత్తుకునేలా తీసి కంటతడి పెట్టిస్తున్నఈ సినిమా అరుదైన స్ట్రీమింగ్ రికార్డు అందుకుంది.

Published on: Jan 29, 2026, 18:31:34 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఈమధ్యే అడుగుపెట్టిన తమిళ క్రైమ్ డ్రామా సిరై (Sirai). తెలుగులోనూ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకూ ఏ ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డును ఈ మూవీ అందుకున్నట్లు ఆ ఓటీటీ తాజాగా వెల్లడించింది. ఈ క్రైమ్ ఎమోషనల్ డ్రామాకు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సిరై స్ట్రీమింగ్ రికార్డు

హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్ స్టోరీ.. ఓటీటీలో దుమ్ము రేపుతున్న తమిళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్ స్టోరీ.. ఓటీటీలో దుమ్ము రేపుతున్న తమిళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్ స్టోరీ.. ఇది నిజ జీవితంలోనే కాదు తెరపై ఇలాంటిది చూపించాలన్నా పెద్ద సాహసమే చేయాలి. ఇలాంటి సున్నితమైన సబ్జెక్ట్ ను ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన సిరై మూవీకి ఓటీటీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

దీంతో జీ5 ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే 156 ప్లస్ మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమా ఇదే అని జీ5 ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ మైలురాయి గురించి చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

సిరై మూవీ విశేషాలు

సిరై మూవీని సురేష్ రాజకుమారి డైరెక్ట్ చేశాడు. ఇందులో విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజాలాంటి వాళ్లు నటించారు. జనవరి 23 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళనాట థియేటర్లలో రిలీజైనప్పుడు సంచలనం సృష్టించి, ఎంతో ఆలోచింపజేసిన సినిమా ఇది.

ఓ హిందూ అమ్మాయిని ఓ ముస్లిం అబ్బాయి ప్రేమించడం, అనుకోకుండా అతడు ఓ హత్య కేసులో ఇరుక్కోవడం, ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉన్న అతన్ని జైలు నుంచి కోర్టుకు ఎస్కార్టుగా తీసుకుపోయే క్రమంలో ఓ పోలీస్ అధికారి జీవితం ఎలా మారిపోయిందన్నదే ఈ సిరై మూవీ కథ. కులాంతర వివాహాలనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సమాజంలో మతాంతర వివాహం అనేది అసలు ఊహకందనిది. అలాంటి సబ్జెక్ట్ తీసుకొని ఎంతో సున్నితంగా హ్యాండిల్ చేసిన విధానం చాలా మందికి నచ్చింది. ఈ మూవీ ఎమోషనల్ గానూ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దీంతో థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe