ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ వెబ్ సిరీస్ ‘తడయం’ (Thadayam). ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. గతేడాది రేఖై, హార్టిలీ బ్యాటరీ, వేడువన్ వంటి సిరీస్‌లను అందించిన జీ5.. ఈ ఏడాది ‘తడయం’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అర్ధరాత్రి హత్యలు చేసే కిల్లర్, అతన్ని పట్టుకోవడానికి సాగే వేట చుట్టూ తిరిగే కథ ఇది.
తడయం ఓటీటీ రిలీజ్ డేట్

క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ తమిళ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సముద్రఖని పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకుముందే ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆ ఓటీటీ తాజాగా శుక్రవారం (జనవరి 30) స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది. సముద్రఖనిలాంటి నటుడితో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.
తడయం వెబ్ సిరీస్ స్టోరీ ఇదీ
ఈ తడయం వెబ్ సిరీస్ 1999 నాటి కాలంలో జరుగుతుంది. తమిళనాడు సరిహద్దుల్లో అర్ధరాత్రి వేళల్లో జరిగే వరుస హత్యలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఈ హత్యలను ఛేదించడానికి వచ్చిన ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ (సముద్రఖని) ఒక భయంకరమైన విషయాన్ని గుర్తిస్తాడు. హంతకుడు కేవలం వివాహిత స్త్రీల దగ్గర ఉన్న మాంగళ్యం/తాళి మాత్రమే దొంగిలిస్తుంటాడు. ఈ విచిత్రమైన, క్రూరమైన హంతకుడిని పట్టుకునేందుకు సాగే వేట ఈ వెబ్ సిరీస్ కథాంశం.
ఈ తడయం వెబ్ సిరీస్ ను అజయ్ కృష్ణ నిర్మించాడు. నవీన్ కుమార్ పళనివేల్ డైరెక్ట్ చేశాడు. మూడేళ్ల కిందట కూడా ఇదే పేరుతో మరో వెబ్ సిరీస్ రావడం విశేషం. ఇప్పుడీ తాజా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
{{/usCountry}}ఈ తడయం వెబ్ సిరీస్ ను అజయ్ కృష్ణ నిర్మించాడు. నవీన్ కుమార్ పళనివేల్ డైరెక్ట్ చేశాడు. మూడేళ్ల కిందట కూడా ఇదే పేరుతో మరో వెబ్ సిరీస్ రావడం విశేషం. ఇప్పుడీ తాజా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
{{/usCountry}}ఇక ఇటీవలే విక్రమ్ ప్రభు నటించిన ‘సిరై’ (Sirai) సినిమా కూడా జీ5లో విడుదలైంది. అలాగే శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ (Parasakthi) ఫిబ్రవరి 7న ఇదే ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.