Immortal Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'వ్యాంపైర్' (రక్తపిశాచి) నేపథ్యంతో వచ్చే సినిమాలు చాలా అరుదు. ఆ మధ్య మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా: చాప్టర్ 1' మూవీ భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ఇమ్మోర్టల్. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా మరియప్పన్ చిన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కయాదు అందానికి తోడు భయపెట్టే సీన్లతో సాగిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథేంటి? చూడొచ్చా లేదా అన్నది తెలుసుకోండి.
ఇమ్మోర్టల్ కథాంశం ఏమిటంటే?
ఇమ్మోర్టల్ మూవీ కథ ఒక గిరిజన తెగను చూపిస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్ సీన్ తో ప్రారంభమవుతుంది. అక్కడి గిరిజన మహిళ మనుషులకు కాకుండా వింత రూపాంతరం చెందిన శిశువుకు జన్మనిస్తుంది. ఆ వింత జీవిని భర్త అడవిలో తోడేలు ముందు వదిలివేస్తాడు. కట్ చేస్తే వర్తమానంలో.. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే మాగి (జీవీ ప్రకాష్ కుమార్) అనే సాధారణ యువకుడు అద్దె ఇల్లు కోసం వెతుకుతుంటాడు.
ఆ సమయంలో సింధు (కయాదు లోహర్) అనే అత్యంత అందమైన యువతి నుంచి వచ్చిన పిలుపుతో ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. సింధు అందానికి ముగ్ధుడైన మాగి వెంటనే ఆ ఇంట్లోకి అద్దెకు దిగుతాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారుతున్న సమయంలో.. సింధు సాధారణ మనిషి కాదని, 1,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక రక్తపిశాచి (Vampire) అని మాగికి తెలుస్తుంది.
తన రక్త దాహం తీర్చుకోవడానికి మాగిని ఒక వింతయిన మాయా ప్రపంచంలో బంధిస్తుంది. ఆ దెయ్యాల వల నుంచి మాగి తప్పించుకోగలిగాడా? అసలు సింధు వెనుక ఉన్న 1,000 ఏళ్ల మిస్టరీ ఏమిటి? అనేది మిగతా కథ.
డార్క్ లవ్ స్టోరీ.. కళ్లు చెదిరే కయాదు లోహర్
{{/usCountry}}తన రక్త దాహం తీర్చుకోవడానికి మాగిని ఒక వింతయిన మాయా ప్రపంచంలో బంధిస్తుంది. ఆ దెయ్యాల వల నుంచి మాగి తప్పించుకోగలిగాడా? అసలు సింధు వెనుక ఉన్న 1,000 ఏళ్ల మిస్టరీ ఏమిటి? అనేది మిగతా కథ.
డార్క్ లవ్ స్టోరీ.. కళ్లు చెదిరే కయాదు లోహర్
{{/usCountry}}దర్శకుడు మరియప్పన్ చిన్న రాసుకున్న కథ, వ్యాంపైర్ బ్యాక్‌స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రక్తపిశాచి బ్యాక్‌డ్రాప్ లో లవ్ స్టోరీ, అందులో భాగంగా వచ్చే సీన్స్ ప్రేక్షకులను రెండు గంటల నిడివిలో స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేస్తాయి. ముఖ్యంగా హీరోయిన్ కయాదు లోహర్ తన అందంతో, మత్తెక్కించే చూపులు, నటనతో స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. ప్రతి సీన్‌లోనూ ఆమె ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
హీరో జీవీ ప్రకాష్ కుమార్ ఫస్టాఫ్ లో కాస్త నెమ్మదిగా అనిపించినా, సెకండాఫ్ లో తను ఎదుర్కొంటున్న ఓ భయంకరమైన వాతావరణాన్ని, భయాన్ని ఎంతో పరిణతితో పండించారు. ఇతర నటులు ఎల్.ఎస్. మారన్, టి.ఎమ్. కార్తీక్ తమ పాత్రల పరిధి మేర నటించారు.
క్లైమ్యాక్స్ పెద్ద మైనస్
సినిమాకు కథాబలం ఉన్నప్పటికీ, సాంకేతిక లోపాలు సినిమా స్థాయిని తగ్గించాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX), దెయ్యం డిజైన్ చాలా సాధారణంగా, అవుట్‌డేటెడ్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఒక సాధారణ మనిషికి, భారీ గబ్బిలంలాంటి రాక్షసుడికి మధ్య జరిగే ఫైట్ సీన్ ఆకట్టుకోవడానికి బదులు నవ్వు తెప్పించేలా ఉంది. రక్త పిశాచి మెడపై కొరికి రక్తం తాగే సీన్‌లో కూడా మెడపై కనీసం గాయం కనిపించకపోవడం వంటి లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
సామ్ సి.ఎస్ (Sam C.S.) అందించిన సంగీతం సన్నివేశాలకు తగినట్లుగా ఉందే తప్ప ప్రత్యేకంగా గుర్తుండిపోదు. ఎడిటింగ్ పర్వాలేదనిపించినా, క్లైమాక్స్ సీన్‌ను ఇంకా జాగ్రత్తగా డిజైన్ చేసి ఉంటే 'ఇమ్మోర్టల్' వ్యాంపైర్ జానర్‌లో ఒక క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచేది.
మొత్తం చూస్తే సాధారణ వీఎఫ్ఎక్స్ లోపాలను పక్కనబెడితే.. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్స్, వ్యాంపైర్ కథలను ఇష్టపడే వారికి 'ఇమ్మోర్టల్' ఒకసారి చూడదగ్గ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ చూసేయండి.