OTT Review: నిజాయతీకి ఓ పేదవాడు చెల్లించుకునే మూల్యం.. అతని పరువుకు ఈ దేశం ఇచ్చే విలువ.. ఈ వ్యవస్థలో న్యాయం కోసం ఓ డబ్బు లేని వాడు చేసే పోరాటం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన మూవీ ఎన్న విలై (Enna Vilai). ఈ తమిళ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.
రామేశ్వరం బ్యాక్‌డ్రాప్‌లో..

సాధారణంగా సముద్రంలో దొరికిన నిధి ఒక పేదవాడి జీవితాన్ని మారుస్తుందని అనుకుంటాం. కానీ ఆ బంగారమే అతని మెడకు ఉరితాడై, పోలీస్ వ్యవస్థ కుట్రలో బలిపశువును చేస్తే పరిస్థితి ఏంటి? రామేశ్వరం సముద్ర తీర నేపథ్యంలో తెరకెక్కిన భావోద్వేగపూరిత కోర్టు రూమ్ డ్రామా ‘ఎన్న విలై’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
'తొండిముత్త దృక్షాక్షితియుమ్' వంటి క్లాసిక్ థ్రిల్లర్‌కు కథ అందించిన జాతీయ అవార్డు గ్రహీత రచయిత సజీవ్ పళూర్ అందించిన కథతో వచ్చిన ఈ చిత్రం, ఒక అమాయక మత్స్యకారుడి ఆత్మగౌరవ పోరాటాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించింది.
ఎన్న విలై స్టోరీ ఏంటంటే?
తవశి (కరుణాస్) రామేశ్వరం సముద్ర తీరంలో భక్తులు విసిరే నాణేలను నీటిలోకి దూకి సేకరిస్తూ జీవనం సాగించే ఒక సాధారణ మత్స్యకారుడు. తన పిల్లలను బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనేదే అతని ఏకైక ఆశయం. ఒకరోజు సముద్రంలోకి వెళ్లి నాణేలు వెతుకుతున్న సమయంలో అతనికి ఒక అత్యంత విలువైన బంగారు లాకెట్ ఒకటి దొరుకుతుంది. అయితే దానిపై ఆశ పడకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించడానికి వెళ్తాడు.
అక్కడే అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఆ ఆభరణంలోని ఖరీదైన రత్నాన్ని నొక్కేసిన ఒక అవినీతి పోలీస్ అధికారి.. తవశిపైనే దొంగతనం కేసు మోపి జైలుకు పంపుతాడు. ఈ క్లిష్ట సమయంలో అడ్వకేట్ కాంచన (నిమిషా సజయన్) తవశి తరఫున వాదించడానికి రంగంలోకి దిగుతుంది. నిధి హక్కులు, ప్రభుత్వ అధికారం, పోలీస్ కస్టడీ చుట్టూ కోర్టులో జరిగే సుదీర్ఘమైన వాదనలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయనేది మిగిలిన కథ.
కరుణాస్, నిమిష.. నెక్ట్స్ లెవెల్
{{/usCountry}}అక్కడే అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఆ ఆభరణంలోని ఖరీదైన రత్నాన్ని నొక్కేసిన ఒక అవినీతి పోలీస్ అధికారి.. తవశిపైనే దొంగతనం కేసు మోపి జైలుకు పంపుతాడు. ఈ క్లిష్ట సమయంలో అడ్వకేట్ కాంచన (నిమిషా సజయన్) తవశి తరఫున వాదించడానికి రంగంలోకి దిగుతుంది. నిధి హక్కులు, ప్రభుత్వ అధికారం, పోలీస్ కస్టడీ చుట్టూ కోర్టులో జరిగే సుదీర్ఘమైన వాదనలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయనేది మిగిలిన కథ.
కరుణాస్, నిమిష.. నెక్ట్స్ లెవెల్
{{/usCountry}}తవశి పాత్రలో సీనియర్ నటుడు కరుణాస్ తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో, సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరిస్తూ, తన ఆత్మగౌరవం కోసం పరితపించే ఒక సగటు తండ్రి వేదనను ఆయన కళ్లలో అద్భుతంగా పలికించారు. లాయర్ కాంచనగా నిమిషా సజయన్ మరోసారి తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. కోర్టు రూమ్‌లో ఆమె వినిపించే వాదనలు, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే తీరు ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
సామ్ సీఎస్ (Sam C.S.) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను, ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ సంగీతం ఇచ్చే హై ఫీల్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో కేసు నమోదు చేసే కొన్ని సన్నివేశాలు కాస్త వేగంగా అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో సాగే డ్రామా సినిమాను నిలబెట్టింది.
వ్యవస్థ చేసిన తప్పును అదే వ్యవస్థతో అంగీకరింపజేయడానికి ఒక సాధారణ పౌరుడు ఎంతటి మానసిక వేదన అనుభవించాలో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. సోషల్ డ్రామాలు, లీగల్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న 'ఎన్న విలై' ఒక పర్ఫెక్ట్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ. తెలుగులోనూ ఈ సినిమాను చూసే వీలుంది. ఈ వీకెండ్ ఓ లుక్కేయండి.