తమిళ టాలెంటెడ్ యాక్టర్ శశికుమార్, కన్నడ బ్యూటీ చైత్ర జె ఆచార్ మెయిన్ లీడ్స్‌గా నటించిన లేటెస్ట్ తమిళ సోషల్ డ్రామా మై లార్డ్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా ఫైనల్‌గా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మై లార్డ్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

మై లార్డ్ మూవీ ఈ ఏడాదిలో వచ్చిన ఒక ఇంటెన్స్ తమిళ క్రైమ్ సోషల్ డ్రామా. యాక్టర్ కమ్ డైరెక్టర్ శశికుమార్ ఇందులో హీరోగా చేయగా, చైత్ర జె ఆచార్ హీరోయిన్‌గా నటించింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం తమిళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసేయొచ్చు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఐదు వారాల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది.
గుండెల్ని పిండేసే మై లార్డ్ స్టోరీ ఇదే..
అసలు ఈ మై లార్డ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది సమాజంలో ఎప్పుడూ అణచివేతకు, దోపిడీకి గురయ్యే ఒక జంట చుట్టూ తిరుగుతుంది. కొన్ని ఊహించని సంఘటనల తర్వాత వాళ్లకు తెలియకుండానే వాళ్ల శరీరంలోని అవయవాలను కొందరు దొంగిలించారని ఆ జంటకు తెలుస్తుంది. అంతేకాదు అసలు వాళ్లు చనిపోయారని కూడా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక హై ప్రొఫైల్ కేంద్ర మంత్రి కోసం తమ కిడ్నీ డొనేట్ చేయాలని ఇంకొందరు వాళ్లను బాగా బలవంతపెడుతుంటారు.
ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఒక పవర్ఫుల్ స్టోరీ. ఒక చిన్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాయంతో ఆ జంట తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు, తమ ఉనికి కోసం ఏం చేశారు అనేది ఈ సినిమా ప్రధాన స్టోరీ. పవర్, ఐడెంటిటీ లాంటి సీరియస్ థీమ్స్‌ను ఇందులో చాలా లోతుగా చూపించారు.
మై లార్డ్ నటీనటులు, ఇతర వివరాలు
{{/usCountry}}ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఒక పవర్ఫుల్ స్టోరీ. ఒక చిన్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాయంతో ఆ జంట తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు, తమ ఉనికి కోసం ఏం చేశారు అనేది ఈ సినిమా ప్రధాన స్టోరీ. పవర్, ఐడెంటిటీ లాంటి సీరియస్ థీమ్స్‌ను ఇందులో చాలా లోతుగా చూపించారు.
మై లార్డ్ నటీనటులు, ఇతర వివరాలు
{{/usCountry}}శశికుమార్, చైత్ర జె ఆచార్‌తో పాటు ఈ మై లార్డ్ సినిమాలో గురు సోమసుందరం, జయప్రకాష్, ఆశా శరత్, గోపి నైనార్, వసుమిత్ర లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు స్టోరీ రాసి డైరెక్ట్ చేయగా, సీన్ రోల్డన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
స్టార్ హీరో సూర్య తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం మరో విశేషం. రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి, బాక్సాఫీస్ దగ్గర కూడా ఒక డీసెంట్ వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ డ్రామా 3BHK మూవీ తర్వాత చైత్రకు కోలీవుడ్‌లో ఇది రెండో తమిళ సినిమా.