OTT Tamil: తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆపై సంగీత దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి హిప్హాప్ తమిళ ఆది (Hiphop Tamizha Adhi). తాజాగా 2017లో ఆయన దర్శకత్వం వహించి నటించిన యూత్‌ఫుల్ మ్యూజికల్ హిట్ 'మీసయ మురుక్కు' (Meesaya Murukku) కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'మీసయ మురుక్కు 2' (Meesaya Murukku 2) సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమాలో హిప్హాప్ తమిళ ఆది తొలిసారి ట్రిపుల్ రోల్ పోషించి అలరించడం విశేషం.
సోనీ లివ్‌లో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్
ఈ మీసయ మురుక్కు 2 సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్, విడుదల తేదీపై మేకర్స్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (SonyLIV) 'మీసయ మురుక్కు 2' డిజిటల్ హక్కులను దక్కించుకుంది. రాబోయే నవంబర్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
త్రిపాత్రాభినయంలో హిప్హాప్ ఆది.. కథేంటంటే?
మొదటి భాగం పూర్తి కాలేజ్ రొమాన్స్, మ్యూజికల్ ప్రయాణంగా సాగితే.. 'మీసయ మురుక్కు 2' కథాంశం మూడు తరాలకు చెందిన ఒక సంగీత విద్వాంసుల కుటుంబం నేపథ్యంలో సాగుతుంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆ కుటుంబంలోని మూడు తరాల వ్యక్తులు ఎదుర్కొన్న సవాళ్లు, కార్పొరేట్ వ్యవస్థ వల్ల ఇండిపెండెంట్ మ్యూజిక్ రంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు.
ఈ సినిమాలో హిప్హాప్ తమిళ ఆది ఏకంగా ట్రిపుల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సరసన కేతికా శర్మ, చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా నటించగా, రమ్య రంగనాథన్, బాబా భాస్కర్, హర్షత్ ఖాన్, నాజర్, కరుణాస్ కీలక పాత్రలు పోషించారు.
మీసయ మురుక్కు 2.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌పై మెసేజ్
{{/usCountry}}ఈ సినిమాలో హిప్హాప్ తమిళ ఆది ఏకంగా ట్రిపుల్ రోల్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సరసన కేతికా శర్మ, చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా నటించగా, రమ్య రంగనాథన్, బాబా భాస్కర్, హర్షత్ ఖాన్, నాజర్, కరుణాస్ కీలక పాత్రలు పోషించారు.
మీసయ మురుక్కు 2.. ఇండిపెండెంట్ మ్యూజిక్‌పై మెసేజ్
{{/usCountry}}సంగీత ప్రాధాన్యత ఉన్న సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి హిప్హాప్ తమిళ ఆది స్వయంగా సంగీతాన్ని సమకూర్చి పాటలను అందించారు. బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ అందించగా, ఫెన్నీ ఆలివర్, తిరుమలై రాజన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
సీనియర్ నటి ఖుష్బూ సుందర్ 'అవని మూవీస్' (Avni Movies) బ్యానర్‌పై ఏసీఎస్ అరుణ్ కుమార్‌తో కలిసి బెంచ్ మీడియా భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కమర్షియల్ హంగులతో చూపించిన ఈ మ్యూజికల్ థ్రిల్లర్.. ఓటీటీ ప్రియులకు ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్‌కు నవంబర్ 6 నుంచి సోనీ లివ్‌లో మంచి ఎంటర్టైన్మెంట్ కానుంది.