తమిళంలో మైథలాజికల్ థ్రిల్లర్ తరచూ వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో ఉన్నాయి. వాటిలోకి తాజాగా మహాసేన (Mahasenha) అనే మరో సినిమా వచ్చి చేరుతోంది. ఈ మూవీ ఏంటి? ఐఎండీబీలో దీనికి 9.2 రేటింగ్ రావడానికి కారణమేంటో చూడండి.
మహాసేన ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ థ్రిల్లర్ కు కాస్త మైథాలజీని జోడించి వస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. కాంతార కూడా అలా వచ్చే పెద్ద విజయం సాధించింది. తమిళంలోనే మహాసేన పేరుతో ఓ మూవీ వచ్చింది. ఈ సినిమా మంగళవారం (జనవరి 13) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
“సస్పెన్స్ తో కూడిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మహాసేన.. జనవరి 13న కేవలం ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. రెండు భాగాలుగా ఈ మూవీ రానుండగా.. మొదటి భాగం ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
మహాసేన మూవీ విశేషాలు
మహాసేన (Mahasenha) మూవీ గతేడాది డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. విమల్ లీడ్ రోల్లో నటించాడు. దినేష్ కలైసెల్వన్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇదో లో బడ్జెట్ మూవీ. అడవిలో ఉండే చిన్న ఊరు. అక్కడ తన కూతురు, తన ఏనుగును ప్రాణంగా చూసుకుంటూ ఉండే హీరో.. అనుకోకుండా ఆ కూతురు చనిపోవడం.. ఆ ఊరి గ్రామ దేవత విగ్రహాన్ని ఎత్తుకుపోవడానికి బయటి వాళ్లు చేసే కుట్ర.. దానిని కాపాడుకోవడం కోసం ఊళ్లో వాళ్లు చేసే ప్రయత్నాలు.. ఇలా సాగిపోతుందీ మహాసేన మూవీ.
థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే ఐఎండీబీలో మాత్రం ఏకంగా 9.2 రేటింగ్ నమోదవడం విశేషం. తమిళంలో తరచూ ఇలాంటి మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. ఆ కోవలోనిదే ఈ మహాసేన కూడా. ఈ సినిమాను జనవరి 13 నుంచి తమిళంలో ఆహా తమిళం ఓటీటీలో చూడొచ్చు.
{{/usCountry}}థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే ఐఎండీబీలో మాత్రం ఏకంగా 9.2 రేటింగ్ నమోదవడం విశేషం. తమిళంలో తరచూ ఇలాంటి మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. ఆ కోవలోనిదే ఈ మహాసేన కూడా. ఈ సినిమాను జనవరి 13 నుంచి తమిళంలో ఆహా తమిళం ఓటీటీలో చూడొచ్చు.
{{/usCountry}}