...
...
Next Story

OTT Romantic: దీపావళి సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి నేరుగా వస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. బిచ్చగాడు డైరెక్టర్ మూవీ

OTT Romantic: తమిళంలో యూత్‌ఫుల్ హీరో హరీష్ కళ్యాణ్, 'వెందు తనింధధు కాడు' ఫేమ్ సిద్ధి ఇద్నాని జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ డ్రామా 'నూరు కోడి వానవిల్' (Nooru Kodi Vaanavil). 'పిచ్చైకారన్' (బిచ్చగాడు) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు శశి ఈ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించారు.

Published on: Oct 28, 2026, 18:47:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Romantic: ఈ దీపావళి పండుగ సీజన్ ఓటీటీ ఆడియెన్స్ కు సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. ప్రేమికుల హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు, ఆధునిక సంబంధాలు, రొమాంటిక్ మ్యాజిక్‌తో కూడిన సరికొత్త తమిళ రొమాంటిక్ డ్రామా 'నూరు కోడి వానవిల్' (Nooru Kodi Vaanavil) ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

OTT Romantic: దీపావళి సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి నేరుగా వస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. బిచ్చగాడు డైరెక్టర్ మూవీ
OTT Romantic: దీపావళి సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి నేరుగా వస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా.. బిచ్చగాడు డైరెక్టర్ మూవీ

'పిచ్చైకారన్' (తెలుగులో 'బిచ్చగాడు'), 'డిష్యుమ్' వంటి అద్భుతమైన ఎమోషనల్ హిట్ చిత్రాలను అందించిన సీనియర్ దర్శకుడు శశి (Sasi) ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ అందించడం విశేషం. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి పండుగ కానుకగా ప్రముఖ డిజిటల్ ఓటీటీ వేదిక 'జీ5' (ZEE5) లో నవంబర్ 6 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.

నూరు కోడి వానవిల్ స్టోరీ.. ఆధునిక ప్రేమ, బంధాలు, సవాళ్లు

'నూరు కోడి వానవిల్' (వంద కోట్ల హరివిల్లులు అని అర్థం) స్టోరీ విషయానికి వస్తే నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక భావోద్వేగాలు, ప్రేమ సంబంధాలు, ఆచరణాత్మక సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఇందులో హరీష్ కళ్యాణ్ 'వినో' అనే పాత్రలో కనిపిస్తుండగా, సిద్ధి ఇద్నాని 'ఫెన్నీ' పాత్రలో నటించారు.

ఒకే ఇంట్లో నివసించే విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు యువతీ యువకుల మధ్య ఏర్పడిన పరిచయం, ఆపై అది ప్రేమగా ఎలా మారింది? వారి ప్రేమ ప్రయాణంలో ఎదురైన ఊహించని సవాళ్లను వారిద్దరూ ఎలా దాటారు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. నేటితరం ఆలోచనలకు అద్దం పట్టేలా శశి ఈ చిత్రాన్ని ఎంతో సహజంగా తీర్చిదిద్దారు.

నూరు కోడి వానవిల్ మూవీ విశేషాలు

సంగీత దర్శకుడు సిద్ధు కుమార్ (Siddhu Kumar) ఈ చిత్రానికి వీనులవిందైన స్వరాలు అందించగా, ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మాధవ్ మీడియా, ఏఏ ప్రొడక్షన్స్ బ్యానర్లపై బాలాజీ కాపా, అరుణ్ అరుణాచలం అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నవంబర్ 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్

ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) దక్కించుకుంది. "ఈ దీపావళికి మీ హృదయాలను ప్రేమ కాంతులతో నింపేయండి! నవంబర్ 6 నుంచి 'నూరు కోడి వానవిల్' డిజిటల్ ప్రీమియర్ కానుంది" అంటూ ఓటీటీ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది. ఫీల్-గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడే తెలుగు, తమిళ ఓటీటీ ప్రియులకు ఇది ఒక బెస్ట్ వీకెండ్ ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks