...
...
Next Story

తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి.. ఈవారమే స్ట్రీమింగ్.. వరుస హత్యలను ఛేదించే ఆ ఒక్కడు

తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రెండున్నర నెలల తర్వాత ఈవారం ఓటీటీలోకి వస్తోంది. వరుస హత్యలను ఛేదించడంలో పోలీసులకు ఓ వ్యక్తి చేసే సాయం చుట్టూ తిరిగే కథ ఇది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ నమోదైంది.

Published on: Oct 14, 2025, 19:11:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ముదల్ పక్కమ్ (Muthal pakkam). ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అసలు ఈ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకోండి.

ముదల్ పక్కమ్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి.. ఈవారమే స్ట్రీమింగ్.. వరుస హత్యలను ఛేదించే ఆ ఒక్కడు
తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి.. ఈవారమే స్ట్రీమింగ్.. వరుస హత్యలను ఛేదించే ఆ ఒక్కడు

తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చెన్నై ఫైల్స్: ముదల్ పక్కమ్ ఈవారం ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను ఆహా తమిళం ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. వచ్చే శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని ఆహా తమిళం ఓటీటీ మంగళవారం (అక్టోబర్ 14) వెల్లడించింది.

“త్వరలోనే మొదటి పేజీ చూసే సమయం దగ్గరపడింది.. ముదల్ పక్కమ్ ఆహా తమిళంలో అక్టోబర్ 17న ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది.

ముదల్ పక్కమ్ మూవీ గురించి..

చెన్నై ఫైల్స్: ముదల్ పక్కమ్ మూవీ ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను అనీష్ అష్రఫ్ డైరెక్ట్ చేశాడు. కథ కూడా అతడే అందించాడు. ఇందులో వెట్రి, శిల్పా మంజునాథ్, తంబి రామయ్య, రెడిన్ కింగ్స్‌లే, కన్నా రవిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా వరుస హత్యలను ఛేదించే ఓ పోలీస్ టీమ్ చుట్టూ తిరుగుతుంది. హంతకుడు సుత్తితో హత్యలు చేస్తూ వాటికి ఓ మాస్క్ తగిలిస్తూ ఉంటాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks