ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చీకటి కోణాన్ని చూపిస్తూ అదిరిపోయే సస్పెన్స్

ఓటీటీలోకి ఈరోజు అంటే డిసెంబర్ 19న ఓ ఇంట్రెస్టింగ్ తమిళ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెనుక ఉన్న మిస్టరీని చూపెడుతూ.. అదిరిపోయే సస్పెన్స్ తో సాగిపోయే మూవీ ఇది. 

Published on: Dec 19, 2025, 14:22:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం చాలా మంచి కంటెంటే వచ్చింది. తెలుగుతోపాటు వివిధ భాషల మూవీస్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి. ఇక ఆదిత్య మాధవన్, గౌరీ కిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మెడికల్ థ్రిల్లర్ 'అదర్స్' (Others) కూడా ఇందులో ఒకటి. శుక్రవారమే (డిసెంబర్ 19) ఓటీటీలో విడుదలైంది. ఐవీఎఫ్ (IVF) మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చీకటి కోణాన్ని చూపిస్తూ అదిరిపోయే సస్పెన్స్
ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చీకటి కోణాన్ని చూపిస్తూ అదిరిపోయే సస్పెన్స్

అదర్స్ ఓటీటీ స్ట్రీమింగ్

థియేటర్లలో నవంబర్ 7న విడుదలైన తమిళ థ్రిల్లర్ మూవీ 'అదర్స్'. ఆదిత్య మాధవన్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో '96', 'బేబీ' ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది కేవలం తమిళ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదొక మెడికల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఐవీఎఫ్ పద్ధతిలో పుట్టిన పిల్లల వెనుక ఉన్న ఒక భారీ కుట్రను ఛేదించే పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఆసుపత్రుల్లో అండాల చోరీ, నిషేధిత రసాయనాల వాడకం వంటి చీకటి కోణాలను ఈ సినిమాలో చూపించారు. అంజు కురియన్, మునిష్‌కాంత్, హరీష్ పేరడి ఇతర కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ వైబోధ సంగీతం అందించాడు. సస్పెన్స్ తోపాటు అతని మ్యూజిక్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.

వివాదంతో వైరల్..

సినిమా రివ్యూలు ఎలా ఉన్నా.. ప్రమోషన్ల సమయంలో జరిగిన ఒక సంఘటన వల్ల ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ గౌరీ కిషన్ బరువు గురించి మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేయగా, ఆమె అతనికి ఘాటుగా సమాధానం ఇచ్చి క్లాస్ పీకింది. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ అదర్స్ సినిమాకు కూడా మంచి పబ్లిసిటీ లభించింది. ఈ మూవీకి థియేటర్లలోనూ ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో 8.3 రేటింగ్ నమోదైంది.

ఇక ఈ అదర్స్ మూవీ ఒక్కటే కాకుండా.. ఈ వీకెండ్ ఓటీటీలో చూడటానికి మరికొన్ని మూవీస్, వెబ్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియోహాట్‌స్టార్ లో ఫార్మా అనే మలయాళం మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, మిసెస్ దేశ్‌పాండే అనే మరో సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్, సంతాన ప్రాప్తిరస్తు అనే తెలుగు కామెడీ డ్రామా.. నెట్‌ఫ్లిక్స్ లో ప్రేమంటే అనే తెలుగు మూవీ, జీ5 ఓటీటీలో డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ అనే మలయాళం థ్రిల్లర్ సినిమాలు చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More