Kotha Cinema Tammareddy: ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగాళ్లతో చేసిన మొదటి మూవీ ఇదే: కొత్త సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja On Kotha Cinema Movie: ఏకంగా 100 మంది కొత్తవాళ్లతో తెలుగులో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కొత్త సినిమా. అజర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగ నటులతో రూపొందించండంపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Aug 25, 2026, 14:53:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tammareddy Bharadwaja On Kotha Cinema Movie: సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్‌తో స్థానికంగా రూపొందించిన మూవీ "కొత్త సినిమా". ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ నటులు టాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషం.

ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగాళ్లతో చేసిన మొదటి మూవీ ఇదే: కొత్త సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ
ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగాళ్లతో చేసిన మొదటి మూవీ ఇదే: కొత్త సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఎడిటింగ్ అంతా ఒక్కరే

సురేష్, రాకేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్‌తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సోమవారం (ఆగస్ట్ 24) సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా 'వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' అనే పేరుతో ఈవెంట్ పలువురు దర్శక నిర్మాతలు అతిథులుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మూవీ టీమ్ తదితరులు విషయాలు చెప్పారు.

తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. "అజర్ ఈ సినిమా టైటిల్ కొత్త సినిమా అని పెట్టడమే కాదు కొత్త ప్రయత్నం కూడా చేశాడు. అందరూ మేల్ ఆర్టిస్టులతో చేసిన మొదటి సినిమా ఇదే కావచ్చు" అని అన్నారు.

"ఇక్కడ సినిమా మేకింగ్ అంటే ఖర్చు, ఆర్టిస్టులు కూడా ఈజీగా దొరకరు. అందుకే అజర్ తన ఊరికి వెళ్లి, అక్కడే టాలెంట్ ఉన్న వారిని చూసుకుని, వారికి ట్రైనింగ్ ఇచ్చి, అక్కడే సినిమా రూపొందించాడు. కచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా చేసి ఉంటాడని నమ్ముతున్నాను. కానీ, వంద మందిని పెట్టాడు ఒక్క అమ్మాయిని కూడాపెట్టలేదు. అందుకు బాధగా ఉంది. ఆయనకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా" అని తమ్మారెడ్డి భరద్వాజ కోరారు.

గోదావరిఖని నుంచి ఇక్కడికి వచ్చామంటే

డీవోపీ జానీ బాషా మాట్లాడుతూ.. "గోదావరిఖని నుంచి మేము ఇక్కడిదాకా వచ్చామంటే కారణం మీ సపోర్ట్ వల్లే. మా అజర్ గారు ప్రతి ఒక్కరి టాలెంట్ చూసి వారిని తీసుకున్నారు. తెలియని వాళ్లకు నేర్పించారు. ప్రేక్షకులందరూ ఇష్టపడే ఒక మంచి మూవీ చేశారు. వర్క్ పట్ల సిన్సియర్‌గా ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం అని ఆయన ప్రూవ్ చేయబోతున్నారు. మా కొత్త సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు.

"మా కొత్త సినిమాను సపోర్ట్ చేసేందుకు ఈ ఈవెంట్‌కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. అందుకు మా అజర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా మ్యూజికల్‌గా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది" అని సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ ధీమా వ్యక్తం చేశారు.

లీవ్ పెట్టి ఇక్కడి వచ్చాం

"నేను మా సినిమా కోసం లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మా మేనేజర్, ఇతర ఆఫీసర్స్ సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. అందరం కొత్త వాళ్లం కలిసి కొత్త సినిమా చేశాం. మేము ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి" అని నటుడు రాకేష్ చెప్పారు.

డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "దర్శకులకు కాన్ఫిడెన్స్ ఊపిరి లాంటిది. నా కథలో హీరో ఒక భాగం అనే నమ్మే ఆత్మవిశ్వాసం వారిలో ఉండాలి. నేను నా కెరీర్‌లో అలాంటి కాన్ఫిడెన్స్‌తోనే కొనసాగాను. దర్శకుడు అజర్‌లో కూడా అలాంటి ఆత్మవిశ్వాసమే కనిపిస్తోంది" అని పేర్కొన్నారు.

క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్‌గా ఉంది

"కొత్త సినిమా మూవీ కంటెంట్ క్రియేటివ్‌గా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈ చిత్రంతో అజర్ డైరెక్టర్‌గా సక్సెస్ కావాలి. ఈ చిత్రంలో నటించిన కొత్త నటీనటులు అందరికీ మంచి పేరు రావాలి" అని దర్శకుడు వీఎన్ ఆదిత్య ఆకాంక్షించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More