Tammareddy: ఎవరు ఈ పిచ్చోడు అనుకున్నాం.. సినిమా రిలీజ్ అయ్యాక మమ్మల్ని పిచ్చోళ్లను చేశాడు.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy: దిగ్గజ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ పై సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస మంగాపురం మూవీ ఇంట్రడక్షన్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: May 30, 2026, 21:53:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tammareddy: టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గురించి తెలియని వాళ్లుండరు. ఎలాంటి సందేహం లేకుండా అనుకున్నది అనుకున్నట్లు ఆయన మాట్లాడతారు. తాజాగా దిగ్గజ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ను ఉద్దేశించి తమ్మారెడ్డి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అశ్వనీ దత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజ (x)
అశ్వనీ దత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజ (x)

శ్రీనివాస మంగాపురం ఈవెంట్

సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జ‌య‌కృష్ణ‌ హీరోగా లాంఛ్ అవుతున్నాడు. అతని డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రానికి అజయ్ భూపతి డైరెక్టర్. ఇందులో రషా తడానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ స్టార్స్ ను పరిచయం చేసేందుకు ‘శ్రీను అండ్ మంగ ఇంట్రడక్షన్ ఈవెంట్’ ను శనివారం (మే 30) నిర్వహించారు. ఈ మూవీని అశ్వినీ దత్ ప్రజెంట్ చేస్తున్నారు.

తమ్మారెడ్డి కామెంట్లు

శ్రీనివాస మంగాపురం ఈవెంట్ కు రాఘవేంద్ర రావు, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ అశ్వినీ దత్ గురించి సంచలన కామెంట్లు చేశారు.

‘‘తెలుగు సినిమాకు అందం, ఒక వన్నె తెచ్చింది దత్ (అశ్వినీ దత్). సినిమాకు గ్లామర్ తెచ్చాడు. ఎన్టీ రామారావుతో పాటలు పాడించి ఆ రోజుల్లోనే విచిత్రం చేశాడు. ఎవరు ఈ పిచ్చోడు అనుకున్నాం. సినిమా రిలీజ్ అయ్యాక మమ్మల్ని పిచ్చోళ్లను చేశాడు’’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

రాఘవేంద్ర రావు గురించి

‘‘రాఘవేంద్ర రావు మాస్టర్ క్రాఫ్ట్ మాన్. తెలుగు సినిమాకే కాదు భారత సినిమాకే ఒక రకమైన కొత్త ఒరవడి సృష్టించాడు. వీళ్లిద్దరు (అశ్వినీ దత్, రాఘవేంద్ర రావు) కలిసి ఎన్ని సినిమాలు చేశారో దిక్కు మొక్కు లేదు. ఇద్దరు కలిసి అద్భుతాలు చేశారు’’ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

ఘట్టమనేని వారసుడు

ఘట్టమనేని వంశం నుంచి మూడో తరం సినిమాల్లోకి వస్తోంది. సూపర్ స్టార్, దివంగత కృష్ణ‌ మనవడు ఘట్టమనేని జయకృష్ణ‌ అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీనివాస మంగాపురం మూవీతో అడుగుపెడుతున్నాడు. ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

శ్రీనివాస మంగాపురం నుంచి ఇప్పటికే టీజర్ రిలీజైంది. ఘట్టమనేని జయకృష్ణ‌ ఇప్పటికే తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నాడు. దీనికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో జయకృష్ణ‌, రషా తడానీ, మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు నటిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More