...
...
Next Story

Taapsee Pannu: హీరోయిన్ల ఎద అందాలు, నడుము వెనుకాలే పడతారు ఎందుకు.. అప్పుడు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తాప్సీ

సౌత్ సినిమాపై వివాదాస్పద కామెంట్స్ చేసి ట్రోలింగ్ కు గురైన తాప్సీ పన్ను(Taapsee Pannu).. తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చింది. సౌత్ అయినా, బాలీవుడ్ అయినా హీరోయిన్ల ఎద అందాలు, నడుము వెనుకే ఎందుకు పడతారో అని ప్రశ్నించింది.

Published on: Feb 26, 2026, 14:15:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల నడుము, ఎద అందాలను చూపించడంపై ఉన్న మోజు గురించి నటి తాప్సీ పన్ను ఇటీవల మాట్లాడింది. బాలీవుడ్ ఎద అందాలపై, సౌత్ ఇండస్ట్రీ నడుముపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె స్పష్టం చేసింది. కెరీర్ ప్రారంభంలో తాను అలాంటి గ్లామరస్ పాత్రలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది.

తాప్సీ ఇచ్చిన వివరణ ఇదీ

Taapsee Pannu: హీరోయిన్ల ఎద అందాలు, నడుము వెనుకాలే పడతారు ఎందుకు.. అప్పుడు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తాప్సీ
Taapsee Pannu: హీరోయిన్ల ఎద అందాలు, నడుము వెనుకాలే పడతారు ఎందుకు.. అప్పుడు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తాప్సీ

గలాటా ప్లస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. గతంలో ఒక పాడ్‌కాస్ట్‌లో తనను అడిగిన ప్రశ్నల గురించి వివరించింది. దక్షిణాది పరిశ్రమకు నడుముపై మోజు ఉందని, హిందీ సినిమా హీరోయిన్ ఎద అందాలపై ఎక్కువ దృష్టి పెడుతుందని అప్పట్లో చర్చ జరిగింది. అయితే తాను ఇచ్చిన సమాధానాన్ని సందర్భం లేకుండా తప్పుగా ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎద అందాలు అయినా, నడుము అయినా.. తన దృష్టిలో ఇదంతా చూసే చూపును బట్టి ఉంటుందని ఆమె చెప్పింది.

బాలీవుడ్ ఇండస్ట్రీ ఎద అందాలపై, దక్షిణాది నడుముపై ఆసక్తి చూపిస్తాయని తాను ఎప్పుడూ విడదీసి చెప్పలేదని ఆమె స్పష్టం చేసింది. బాలీవుడ్‌లో తాను గ్లామరస్ పాత్రలు చేయకపోవడం వల్లే అక్కడ తనను నడుము చూపించమని, బ్రాలకు ప్యాడ్‌లు పెట్టుకోమని ఎవరూ అడగలేదని, కానీ దక్షిణాదిలో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆమె తెలిపింది.

ఆ మోజేంటో నాకు తెలియదు

"ఆ మోజు ఏమిటో నాకు తెలియదు. కానీ హిందీలో అయినా, దక్షిణాదిలో అయినా ఒక రకమైన ఆసక్తి ఉందని మనం అంగీకరించాలి. మీలో ఏ భాగాన్ని హైలైట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. అసలు విషయం ఏమిటంటే.. ఆ మోజు అలా ఉంది. ఈ విషయాలను నాకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ దర్శకుడికి కూడా ఇబ్బందిగానే అనిపించి ఉంటుంది. సెట్‌లో మహిళలు పెద్దగా లేనప్పుడు ఇలాంటివి ఎలా చెబుతారు? అందుకే పరోక్షంగా చెప్పాల్సి వస్తుంది. క్యారవాన్ నుంచి నటి తిరిగి వచ్చిన తర్వాత.. ఆ లుక్ సెట్ అయిందా లేదా అని దర్శకుడు కచ్చితంగా చెక్ చేయాలి. అందుకే ఈ ప్రక్రియ మొత్తం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది" అని తాప్సీ వివరించింది.

ఆ పాత్రలు ఎందుకు చేశానంటే..

అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన 'అస్సీ' సినిమాలో తాప్సీ నటనకు ప్రస్తుతం ప్రశంసలు దక్కుతున్నాయి. అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగేలా పోరాడే న్యాయవాది పాత్రలో తాప్సీ నటించింది. ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో కని కుశృతి, రేవతి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటివరకు రూ.5 కోట్లకు పైగా వసూలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe