సౌతాఫ్రికాతో సిరీస్ జోరులో ఉన్న టీమిండియా.. నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు లక్నోలో కాసేపు రిలాక్స్ అయ్యింది. సోమవారం (డిసెంబర్ 15) రాత్రి కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో సహా జట్టు సభ్యులంతా కలిసి రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) సినిమాను చూశారు. వీరి భద్రత దృష్ట్యా థియేటర్‌లో ఒక స్క్రీన్ మొత్తాన్ని బుక్ చేయడం విశేషం.
దురంధర్ చూసిన క్రికెటర్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. సోమవారం (డిసెంబర్ 15) ఉదయం లక్నో చేరుకుంది. బుధవారం (డిసెంబర్ 17) జరగాల్సిన కీలకమైన నాలుగో మ్యాచ్‌కు ముందు మానసిక ఉల్లాసం కోసం ప్లేయర్స్ సినిమా వైపు చూశారు.
సోమవారం రాత్రి లక్నోలోని ఫీనిక్స్ పలాసియో (Phoenix Palassio) మాల్‌లో ఉన్న మల్టీప్లెక్స్‌కు టీమిండియా చేరుకుంది. రాత్రి 8:10 గంటల షోలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దురంధర్’ను చూశారు.
టీమిండియా ప్లేయర్స్ భద్రత, ప్రైవసీ కోసం థియేటర్ యాజమాన్యం 'ఆడి నంబర్ 10' మొత్తాన్ని కేవలం టీమిండియా కోసమే కేటాయించింది. మొత్తం 40 మంది (ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్) ఈ సినిమాను చూశారు. అర్ధరాత్రి 12:10 గంటలకు షో ముగిసిన తర్వాత వారు హోటల్‌కు వెళ్లారు.
ఎవరెవరు వెళ్లారంటే?
ఈ మూవీ నైట్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తదితరులు క్యాజువల్ వేర్‌లో కనిపించారు. విశేషమేమిటంటే సౌతాఫ్రికాకు చెందిన భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా వారితో కలిసి ఈ హిందీ సినిమాను చూడటానికి వచ్చారు.
ఇక నాలుగో టీ20 విషయానికి వస్తే.. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా స్టేడియంలో జరగనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. భారత జట్టు హయత్ రీజెన్సీలో బస చేయగా.. సౌతాఫ్రికా జట్టు హోటల్ రినైసాన్స్లో ఉంటోంది.
{{/usCountry}}ఇక నాలుగో టీ20 విషయానికి వస్తే.. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా స్టేడియంలో జరగనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. భారత జట్టు హయత్ రీజెన్సీలో బస చేయగా.. సౌతాఫ్రికా జట్టు హోటల్ రినైసాన్స్లో ఉంటోంది.
{{/usCountry}}