...
...
Next Story

Web Series: ఒకరికి మ్యూజిక్ పిచ్చి.. మరొకరికి క్రికెట్ ప్యాషన్.. కానీ ప్రెగ్నెన్సీ వస్తే.. ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్!

Web Series OTT: యూత్ కు కనెక్ట్ అయ్యే కంటెంట్ తో జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ కొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తుంది. అదే ‘టీన్ తిగాడ’. ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది. ఈ సిరీస్ విశేషాలు, రిలీజ్ డేట్ పై ఓ లుక్కేయండి.

Published on: Nov 10, 2026, 14:13:33 IST
Advertisement

Web Series OTT: ప్రస్తుత ఓటీటీ ప్రపంచంలో యూత్ ఫుల్ కంటెంట్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రొమాన్స్, ఫ్రెండ్షిప్, కెరీర్, డ్రామా కలగలిపిన కథలకు ఎప్పుడూ మంచి వ్యూయర్ షిప్ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఎలిమెంట్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీ5 (Zee 5) సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ 'టీన్ తిగాడ' (Teen Tigada).

క్రికెట్ కా ప్యాషన్, మ్యూజిక్ కా జునూన్

ఒకరికి మ్యూజిక్ పిచ్చి.. మరొకరికి క్రికెట్ ప్యాషన్.. కానీ ప్రెగ్నెన్సీ వస్తే.. ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్! (x/Zee5_Official)
ఒకరికి మ్యూజిక్ పిచ్చి.. మరొకరికి క్రికెట్ ప్యాషన్.. కానీ ప్రెగ్నెన్సీ వస్తే.. ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్! (x/Zee5_Official)

ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ప్యాషన్ ఉంటుంది. ఈ టీన్ తిగాడ వెబ్ సిరీస్ లో యువకుడికి ఏమో మ్యూజిక్ పై పిచ్చి. ఆ అమ్మాయికి ఏమో క్రికెట్ అంటే ప్రేమ. అందుకే.. "క్రికెట్ కా ప్యాషన్, మ్యూజిక్ కా జునూన్, పర్ జిందగీ నే లియా ఏక్ అన్ ఎక్స్ పెక్టెడ్ టర్న్!" (క్రికెట్ పై ఇష్టం, సంగీతం పై పిచ్చి.. కానీ జీవితం ఊహించని మలుపు తిరిగింది) అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో భారీగా క్యూరియాసిటీ పెంచుతోంది.

కథలో ఊహించని ట్విస్ట్ ఇదే

సంగీతం, క్రికెట్.. ఇలా ఎవరికి నచ్చిన కెరీర్ ను వారు ఎంచుకుని సరదాగా సాగిపోతున్న లవర్స్ జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. మ్యూజిక్ లో ఎదగాలనుకున్న ఆ యువకుడు, క్రికెటర్ కావాలని కలలు కనే ఆ అమ్మాయి తమ లిమిట్స్ క్రాస్ చేస్తారు. ఫిజికల్ గా ఒకటవుతారు. దీంతో ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది.

ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ గడిపే ఆ లవర్స్ కు జీవితం అకస్మాత్తుగా కొత్త బాధ్యతలను పరిచయం చేస్తుంది. తాము అస్సలు ఊహించని ఈ సంఘటన వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసింది? ఆ ట్విస్ట్ తర్వాత వారి లవ్, కలలు ఏమయ్యాయి? అనేదే ఈ 'టీన్ తిగాడ' వెబ్ సిరీస్ స్టోరీగా తెలుస్తోంది.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తోంది. మంచి విజువల్స్, క్యాచీ డైలాగ్స్ తో కూడిన ఈ సిరీస్.. ఓటీటీ ప్రియులకు ఓ మంచి టైమ్ పాస్. మరి ఆ ఊహించని మలుపు ఏంటో తెలియాలంటే నవంబర్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks