...
...
Next Story

Teja Sajja: ఓ మర్డర్ మిస్టరీ చూస్తున్నట్లు అనిపిస్తుంది.. ఒక్క రోజులోనే ఓకే చెప్పేశాను: ది ట్రైటర్స్ షోపై తేజ సజ్జా

Teja Sajja Prime Video The Traitors Show: తేజ సజ్జా తన లేటెస్ట్ రియాలిటీ షో ది ట్రైటర్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షో చూస్తుంటే ఓ మర్డర్ మిస్టరీ చూస్తున్న ఫీలింగ్ కలుతుందని చెప్పడం విశేషం.

Published on: Oct 7, 2026, 21:35:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Teja Sajja The Traitors Show: పాన్ ఇండియా స్టార్ తేజ సజ్జా హోస్ట్‌గా సరికొత్త అవతారంలో అలరించేందుకు రెడీ అయిపోయారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పాపులర్ రియాలిటీ ఫార్మాట్ 'ది ట్రైటర్స్ తెలుగు' (The Traitors Telugu) అక్టోబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ గ్రాండ్ షో ప్రమోషన్స్‌లో భాగంగా తేజ సజ్జా మీడియాతో ముచ్చటించి పలు క్రేజీ విశేషాలను పంచుకున్నారు.

ఒకే ఒక్క రోజులో ఓకే చెప్పిన ప్రాజెక్ట్

Teja Sajja: ఓ మర్డర్ మిస్టరీ చూస్తున్నట్లు అనిపిస్తుంది.. ఒక్క రోజులోనే ఓకే చెప్పేశాను: ది ట్రైటర్స్ షోపై తేజ సజ్జా
Teja Sajja: ఓ మర్డర్ మిస్టరీ చూస్తున్నట్లు అనిపిస్తుంది.. ఒక్క రోజులోనే ఓకే చెప్పేశాను: ది ట్రైటర్స్ షోపై తేజ సజ్జా

'హనుమాన్', 'మిరాయ్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ హిట్స్ కొట్టిన తేజ సజ్జా.. హోస్టింగ్‌కి సైన్ చేయడం వెనుక ఉన్న సీక్రెట్‌ను రివీల్ చేశారు. హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన వర్షన్ చూసి కేవలం రెండు రోజుల్లోనే ఆ సీజన్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు.

'మిరాయ్' షూటింగ్ పూర్తయ్యాక ప్రైమ్ వీడియో టీమ్ ఈ కాన్సెప్ట్‌తో తనను అప్రోచ్ అయ్యారని, తన కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఓకే చెప్పిన ప్రాజెక్ట్ ఇదేనని తేజ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ఏ రియాలిటీ షోకి లేనంత బిగ్ స్కేల్‌లో దీనిని డిజైన్ చేశారని వెల్లడించారు.

మర్డర్ మిస్టరీ లాంటి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

ఈ షో కంప్లీట్ ఫార్మాట్ గురించి మాట్లాడిన తేజ సజ్జా.. ఇది కేవలం ఒక గేమ్ షో మాత్రమే కాదని చెప్పారు. ప్రతీ ఎపిసోడ్ మైండ్ గేమ్‌లతో, సస్పెన్స్‌తో సాగుతూ ఆడియన్స్‌కి ఒక మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్లుగా రాబోతుండగా, దీని కోసం కేవలం 11 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని తెలిపారు. హిందీ వర్షన్ చూస్తున్నప్పుడు అందులోని పార్టిసిపెంట్లతో ఎమోషనల్ కనెక్షన్ లేదని, కానీ తెలుగులో ప్రగతి, హర్షవర్ధన్, చిన్మయి లాంటి తెలిసిన సెలబ్రిటీలు ఉండటంతో వర్క్ చేయడం ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా అనిపించిందని చెప్పారు.

రూల్స్ బుక్, క్రేజీ గేమ్‌ప్లే.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు..

లైవ్ ఆడియన్స్, పార్టిసిపెంట్స్ తన ముందే ఉండటంతో ఎలాంటి కట్స్ లేకుండా సింగిల్ షాట్‌లో ప్రెజెంట్ చేయడం కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు. మొదట రిలీజ్ చేసే 3 ఎపిసోడ్లు చూస్తేనే ఆడియన్స్‌కి షో కాన్సెప్ట్ ఏంటో పూర్తి క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు.

ఏడేళ్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ షో ఉంటుందని, గ్లోబల్ లెవెల్లో పిల్లల్లో ఈ ఫ్రాంచైజ్‌కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందని తేజ సజ్జా వివరించారు. ఎస్ఓఎల్ ప్రొడక్షన్ (SOL Production) నిర్మించిన ఈ రియాలిటీ షో అక్టోబర్ 15 నుంచి ప్రతీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks