Rana Daggubati Dorothy: తెలుగుతో సంబంధం లేని టైటిల్ ఎందుకు? డోరతీ అంటే ఏంటో చెప్పిన రానా-మద్దతుగా చిన్మయి హాట్ కామెంట్స్

Rana Daggubati Dorothy: టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రశంసలు అందుకున్న తమిళ చిత్రం 'డోరతీ' ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగుతో సంబంధం లేని డోరతీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రానా ఆన్సర్ వైరల్ గా మారింది.

Published on: Oct 1, 2026, 16:44:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rana Daggubati Dorothy: తమిళనాడు రిలీజై తీవ్ర వివాదానికి దారితీసిన మూవీ ‘డోరతీ’. ఇందులో LGBTQ+ నేపథ్యంపై నెట్టింట చర్చ జరుగుతోంది. 1980ల నేపథ్యంతో ఇద్దరు బాల్య స్నేహితులు, వారి జీవితాల్లోకి ఒక మహిళ ప్రవేశించిన తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ తెలుగులోకి రాబోతుంది.

తెలుగుతో సంబంధం లేని టైటిల్ ఎందుకు? డోరతీ అంటే ఏంటో చెప్పిన రానా-మద్దతుగా చిన్మయి హాట్ కామెంట్స్ (x)
తెలుగుతో సంబంధం లేని టైటిల్ ఎందుకు? డోరతీ అంటే ఏంటో చెప్పిన రానా-మద్దతుగా చిన్మయి హాట్ కామెంట్స్ (x)

తెలుగులోకి డోరతీ

తమిళంలో రిలీజై తీవ్ర కాంట్రవర్సీని రేకెత్తించిన డోరతీ మూవీ తెలుగులోకి రాబోతుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ను అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ప్రశ్నకు దగ్గుబాటి రానా ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది.

అదే పేరు ఎందుకు?

ఈ ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్.. "డోరతీ అనే పేరుకు తెలుగు భాషతో సంబంధం లేదు కదా, తెలుగులో కూడా అదే పేరుతో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు?" అని ప్రశ్నించారు.

దీనికి రానా స్పందిస్తూ.. "డోరతీ అంటే 'దేవుడు ఇచ్చిన బహుమతి' అని అర్థం. అది సినిమాలో ఒక ప్రధాన పాత్ర పేరు. సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో మీకే అర్థమవుతుంది. ఆ పేరు కాకుండా వేరే ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు" అని చెప్పారు.

అంతేకాకుండా, "మనం ఏడ్చినా, నవ్వినా, బాధపడినా దానికి ఎలాంటి భాషా భేదం ఉండదు. భావోద్వేగాలకు సరిహద్దులు, భాషలు ఉండవు" అని రానా స్పష్టం చేశారు.

చిన్మయి గట్టి కౌంటర్!

ప్రెస్ మీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, 1900ల నాటి ప్రసిద్ధ పిల్లల పుస్తకం 'ది విజార్డ్ ఆఫ్ ఓజ్' (The Wizard of Oz) లోని 'డోరతీ' పాత్ర పేరు కూడా తెలియదా అంటూ సదరు రిపోర్టర్ పై కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఈ పరిణామంపై సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద 'X' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ రిపోర్టర్ కు మద్దతు తెలిపారు.

అవమానించడం సరికాదు

"చిన్నప్పుడు కథల పుస్తకాలు లేదా కామిక్స్ చదివే వెసులుబాటు అందరికీ ఉండదు. అది అందరి పిల్లలకు దక్కే లగ్జరీ కాదు. విజార్డ్ ఆఫ్ ఓజ్ అనే పుస్తకం గురించి రిపోర్టర్‌కి తెలియకపోతే వెంటనే అవమానించడం సరికాదు. కనీస సానుభూతి ఉంటే మంచిది" అని చిన్మయి పేర్కొన్నారు.

అలాగే, ఈ సినిమాలోని 'క్వీర్' (Queer/LGBTQ+) నేపథ్యంపై వస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, చరిత్రలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధంగా ఉన్న రోజుల్లో తమ గుర్తింపును దాచుకోవడానికి 'ఫ్రెండ్ ఆఫ్ డోరతీ' (Friend of Dorothy) అనే పదాన్ని వాడేవారని, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గ్లోబల్ రీచ్ కోసం కూడా ఒరిజినల్ టైటిళ్లనే కొనసాగిస్తుంటారని ఆమె వివరించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More