Telangana Movie Tickets: సింగిల్ స్క్రీన్, ఐమ్యాక్స్ ఒకటే టికెట్ ధర? తెలంగాణ ప్రభుత్వ టికెట్ల పెంపు జీవో చూశారా?

Telangana Movie Tickets: తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్ల ధరల జీవో రిలీజ్ చేసింది. ఇందులో సింగిల్ స్క్రీన్ తోపాటు ఐమ్యాక్స్ స్క్రీన్ అయినా కూడా గరిష్ఠ ధరను రూ.300గా నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది.

Published on: Aug 19, 2026, 22:30:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Movie Tickets: తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల సినిమా టికెట్ ధరలపై జారీ చేసిన కొత్త జీవో హైదరాబాద్ మూవీ లవర్స్‌కి మైండ్ బ్లాకింగ్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో గరిష్టంగా రూ.300 రేటును ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఐమ్యాక్స్ (IMAX), 75 అడుగుల కంటే పెద్ద జెయింట్ స్క్రీన్‌లకు కూడా ఎలాంటి అదనపు ప్రీమియం ఛార్జీలు అనుమతించబోమని పరోక్షంగా స్పష్టం చేసింది.

Telangana Movie Tickets: సింగిల్ స్క్రీన్, ఐమ్యాక్స్ ఒకటే టికెట్ ధర? తెలంగాణ ప్రభుత్వ టికెట్ల పెంపు జీవో చూశారా?
Telangana Movie Tickets: సింగిల్ స్క్రీన్, ఐమ్యాక్స్ ఒకటే టికెట్ ధర? తెలంగాణ ప్రభుత్వ టికెట్ల పెంపు జీవో చూశారా?

పక్క రాష్ట్రాలు, ఇతర మెట్రో నగరాల్లో ఐమ్యాక్స్ టికెట్ రేట్లు చుక్కలనంటుతున్న వేళ, హైదరాబాద్ ఆడియెన్స్‌కు మాత్రం జేబుకు చిల్లు పడకుండా వరల్డ్ క్లాస్ సినిమా ఎక్స్‌పీరియన్స్ అందుబాటులోకి రాబోతోంది.

ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో బిగ్ బాంగ్.. మహేష్, వెంకీ, రాణా ప్రాజెక్ట్

హైదరాబాద్‌లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలోనే మాస్ ఆడియెన్స్ హబ్‌గా పేరొందిన ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఐకానిక్ సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థానంలో కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉంది. ఏషియన్ గ్రూప్ సునీల్ నారంగ్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి కాంబినేషన్‌లో ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’ పేరుతో ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

నగరంలో ఏకైక ఐమ్యాక్స్ (IMAX) విత్ లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్ ఈ థియేటర్‌లోనే రాబోతోంది. గతంలో ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పెద్ద స్క్రీన్ ఆగిపోయిన తర్వాత, నగరంలో మళ్లీ ఐమ్యాక్స్ మ్యాజిక్ చూడాలని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది అల్టిమేట్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

13 రెట్ల ఇన్వెస్ట్‌మెంట్.. కానీ టికెట్ రేటు సేమ్

సాధారణ మల్టీప్లెక్స్ స్క్రీన్ నిర్మించడంతో పోలిస్తే ఐమ్యాక్స్ ఫార్మాట్ కోసం చేసే పెట్టుబడి దాదాపు 8 నుంచి 13 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీల్లో ఐమ్యాక్స్ టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1200 వరకు విక్రయిస్తుంటారు.

అయితే తెలంగాణ ప్రభుత్వ కొత్త జీవో ప్రకారం స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో క్యాపింగ్ రేటు రూ.300 గానే ఉంది. ఐమ్యాక్స్ లేదా 75 అడుగుల కన్నా పెద్ద స్క్రీన్‌లకు ప్రత్యేక కేటగిరీ కింద రేట్లు పెంచుకునే వెసులుబాటు జీవోలో ఎక్కడా ఇవ్వలేదు. దీంతో ఏఎంబీ క్లాసిక్ ఐమ్యాక్స్‌లో కూడా గరిష్టంగా రూ. 300లకే టికెట్ లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ బాటలోనే ఐమ్యాక్స్?

గతంలో అమీర్‌పేటలో అల్లు అర్జున్, ఏషియన్ కాంబినేషన్‌లో ప్రారంభమైన 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) లో అత్యాధునిక 'డాల్బీ సినిమా' ఫార్మాట్‌ను తీసుకువచ్చారు. దానికి కూడా ఓ రేంజ్‌లో ప్రీమియం టికెట్ రేట్లు ఉంటాయని అంతా ఊహించారు.

కానీ మేనేజ్‌మెంట్ సాధారణ మల్టీప్లెక్స్ రేట్లకే రూ. 295/300 పరిమితిలోనే ప్రేక్షకులకు డాల్బీ ఎక్స్‌పీరియన్స్ అందించింది. ఇప్పుడు ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ ఐమ్యాక్స్ కూడా అదే బిజినెస్ మోడల్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉంది.

ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ మార్కెట్ స్ట్రాటజీ

ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ అనేది పక్కా ప్రైస్-సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్, మాస్ ఆడియెన్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు.

ఇక్కడ గనుక టికెట్ రేట్లు భారీగా పెంచితే, ఓపెనింగ్ వీకెండ్స్ తర్వాత రన్ కష్టమవుతుంది. కాబట్టి ప్రమోటర్లు కూడా నామినల్ రేట్లకే ఐమ్యాక్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తే లాంగ్ రన్‌లో మైండ్ బ్లాకింగ్ ఫుట్‌ఫాల్స్, కలెక్షన్స్ సాధించవచ్చు.

అయితే థియేటర్ ఓపెనింగ్ సమయానికి ప్రమోటర్లు ప్రభుత్వం వద్ద ప్రత్యేక వినతిపత్రం సమర్పించి రేట్ల పెంపు కోసం సంప్రదింపులు జరిపే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా, హైదరాబాద్ ఐమ్యాక్స్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకే రీ-ఎంట్రీ ఇవ్వబోతుండడం మూవీ లవర్స్‌కు నిజంగా పెద్ద పండుగే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More