తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్.. ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా రికార్డు.. మీరు చూశారా లేదా?
తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ ఒకటి ఆహా వీడియో ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఆడియెన్స్ ఫేవరెట్ గా మారిపోయిందని ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
తెలుగులో బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ తక్కువే. అయితే ఆహా వీడియో ఓటీటీలో అలాంటిదే ఓ వెబ్ సిరీస్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్ పేరు 3 రోజెస్. ఈ మధ్యే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సిరీస్ రెండో సీజన్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మరి ఆ సిరీస్ విశేషాలు ఇక్కడ చూడండి.

3 రోజెస్ సీజన్ 2 రికార్డు
ఆహా వీడియో ఓటీటీలో 2021లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ 3 రోజెస్. అప్పట్లో దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో నాలుగేళ్ల తర్వాత అంటే గతేడాది చివర్లో రెండో సీజన్ ను తీసుకొచ్చారు. డిసెంబర్ 13న ప్రీమియర్ అయిన ఈ రెండో సీజన్ కు తొలి సీజన్ కంటే మంచి రెస్పాన్స్ రావడం విశేషం. దీంతో ఇది ఆహా వీడియో ప్లాట్‌ఫామ్ పై ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది.
ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా శుక్రవారం (ఫిబ్రవరి 6) వెల్లడించింది. “ఇది ట్రెండింగ్ లో లేదు.. ఇది ఇప్పటికే ఫేవరెట్. 3 రోజెస్ 2 ఇప్పుడు ఆహాలో ఎక్కువ మంది చూసిన ఒరిజినల్ సిరీస్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ప్రస్తుతం అన్ని ఎపిసోడ్లు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
3 రోజెస్ సీజన్ 2 విశేషాలు
ఆహా వీడియోలో ఉన్న 3 సీజన్ రెండో సీజన్ లో ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు, హర్ష చెముడు, సత్య, ప్రభాస్ శ్రీను, ఇనయా సుల్తానా తదితరులు నటించారు. కిరణ్ కరవల్ల డైరెక్ట్ చేశాడు. ఎస్కేఎన్ నిర్మించాడు. దీనికి షో రన్నర్ గా మారుతి ఉండటం విశేషం. రెండో సీజన్లో నాలుగు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి.
ఇది రీతూ, మేఘన, సృష్టి అనే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ. ముంబై నేపథ్యంలో సాగుతుంది. అక్కడి లైఫ్ స్టైల్ కు తగినట్లే ఈ కొత్త సీజన్ తొలి సీజన్ కంటే మరింత బోల్డ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో ముగ్గురు మహిళా పాత్రల వ్యక్తిగత సమస్యల వెనుక ఉన్న భావోద్వేగాలను కన్విన్సింగ్‌గా చూపించారు. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత ముగ్గురు తమ నటనతో ఎంతో మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు.
బోల్డ్ సీన్స్‌లో కుషిత కల్లపు గ్లామర్ డోస్‌తో అదరగొట్టింది. క్యూట్‌గా, అమాయకంగా కనిపిస్తూ అట్రాక్ట్ చేసింది. ఇక కమెడియన్ సత్య తన కామెడీతో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. సిరీస్‌లో సత్య కామెడీ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ ఇంకా చూడకపోతే వెంటనే ఆహా వీడియో ఓటీటీలో చూసేయండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


