ఓటీటీలోకి ఈమధ్యే వచ్చిన తెలుగు కామెడీ మూవీ ఏనుగుతొండం ఘటికాచలం. ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయింది. రవిబాబు డైరెక్ట్ చేసి, అతిథి పాత్రలో నటించిన ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఓ అరుదైన స్ట్రీమింగ్ రికార్డును సొంతం చేసుకుంది.
ఏనుగుతొండం ఘటికాచలం రికార్డు వ్యూస్

లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ఏనుగుతొండం ఘటికాచలం ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“కడుపుబ్బా నవ్వించే బ్లాక్‌బస్టర్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌తో.. ఏనుగు తొండం ఘటికాచలం ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. విన్ ఒరిజినల్ ఫిల్మ్. కేవలం ఈటీవీ విన్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.
ఏనుగుతొండం ఘటికాచలం మూవీ ఇలా..
ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన రవిబాబు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రవిబాబు తన కెరీర్లో భిన్నమైన పాత్రలు పోషించడమే కాదు.. భిన్నమైన సినిమాలూ తీశాడు. అల్లరి, అనసూయ, అమరావతి, అవునులాంటి మూవీస్ తో పాపులర్ అయ్యాడు. చివరిగా నాలుగేళ్ల కిందట క్రష్ అనే మూవీ తీశాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఏనుగు తొండం ఘటికాచలం సినిమా తీశాడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తోపాటు టీవీ యాంకర్ వర్షిణి సౌందరాజన్, పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులు నటించారు.
ఓ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. 65 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునే ఘటికాచలం అనే వ్యక్తి పాత్రలో నరేష్ నటించాడు. ఆ వయసులో ఇంట్లో పని మనిషిని పెళ్లి చేసుకోవడంతో అతని కొడుకులు, కోడళ్లు మండిపడతారు. అనుకోకుండా ఓరోజు చనిపోవడంతో అతని పేరు మీద లేని ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి, ఆ డబ్బును తీసుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఘటికాచలం నిజంగానే చనిపోతాడా? చివరికి ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
{{/usCountry}}ఓ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. 65 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునే ఘటికాచలం అనే వ్యక్తి పాత్రలో నరేష్ నటించాడు. ఆ వయసులో ఇంట్లో పని మనిషిని పెళ్లి చేసుకోవడంతో అతని కొడుకులు, కోడళ్లు మండిపడతారు. అనుకోకుండా ఓరోజు చనిపోవడంతో అతని పేరు మీద లేని ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి, ఆ డబ్బును తీసుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఘటికాచలం నిజంగానే చనిపోతాడా? చివరికి ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
{{/usCountry}}