OTT Telugu: ఫస్ట్ నైట్ రోజే ఫెయిల్.. మగతనం నిరూపించుకుంటే భూమి.. ఓటీటీలోకి బోల్డ్ తెలుగు కామెడీ మూవీ.. 8.6 రేటింగ్

OTT Telugu: ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఫస్ట్ నైట్ రోజే ఫెయిలై, మగతనం నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉండే ఓ మగాడి కథ ఇది.

Published on: Apr 21, 2026, 21:25:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: ఓటీటీలోకి ఓ బోల్డ్ తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. మార్చి 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పేరు మెన్షన్ హౌస్ మల్లేష్ (Mansion House Mallesh). మగతనం నిరూపించుకుంటే భూమి వస్తుందని ఆశ పడే హీరో.. ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. ఐఎండీబీలో 8.6 రేటింగ్ ఉంది. ఆ వివరాలేంటో చూడండి.

OTT Telugu: ఫస్ట్ నైట్ రోజే ఫెయిల్.. మగతనం నిరూపించుకుంటే భూమి.. ఓటీటీలోకి బోల్డ్ తెలుగు కామెడీ మూవీ.. 8.6 రేటింగ్
OTT Telugu: ఫస్ట్ నైట్ రోజే ఫెయిల్.. మగతనం నిరూపించుకుంటే భూమి.. ఓటీటీలోకి బోల్డ్ తెలుగు కామెడీ మూవీ.. 8.6 రేటింగ్

మెన్షన్ హౌస్ మల్లేష్ ఓటీటీ రిలీజ్ డేట్

తెలుగులో మరో భిన్నమైన కథతో వచ్చిన మూవీ ఈ మెన్షన్ హౌస్ మల్లేష్. మార్చి 6న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు 50 రోజుల తర్వాత అంటే వచ్చే సోమవారం (ఏప్రిల్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. “రెడీయా.. ఊర మాస్ స్టార్ అవుతోంది” అంటూ ఆ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ విషయం తెలిపింది.

మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ స్టోరీ ఇలా..

శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'మెన్షన్ హౌస్ మల్లేష్'. తండ్రి బాటలోనే తాగుడుకు బానిసైన ఒక యువకుడి జీవితం.. పెళ్లి తర్వాత ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ.

మల్లేష్ (శ్రీనాథ్ మాగంటి) అనే సాధారణ గ్రామీణ యువకుడు చిన్నతనం నుంచే తాగుడుకు బానిసవుతాడు. అయితే అతనికి తన బావ అయిన చిన్న పటేల్ (రాజేష్)తో గొడవలు ఉంటాయి. ఈ క్రమంలో తల్లి బలవంతం మీద జ్యోతి (గాయత్రీ రమణ)ని మల్లేష్ పెళ్లి చేసుకుంటాడు.

అయితే శోభనం రాత్రే మల్లేష్‌కు ఒక ఊహించని షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ రహస్యం ఏమిటి? దానివల్ల మల్లేష్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? చిన్న పటేల్ సవాలును మల్లేష్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. మగతనం నిరూపించుకొని భూమిని పొందాల్సిన పరిస్థితుల్లో ఆ యువకుడు ఎలాంటి పనులు చేశాడన్నది ఫన్నీగా ఈ సినిమాలో చూపించారు.

పెళ్లి తర్వాత వచ్చే మలుపులు, ఎమోషనల్ సీన్లు సినిమాకు బలంగా నిలిచాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం, పాతకాలపు సీన్లు కొంచెం బోర్ కొట్టిస్తాయి. మల్లేష్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి చక్కగా ఒదిగిపోయాడు. ఈ చిన్న సినిమా మార్చి 6న థియేటర్లలో వచ్చినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడాలనుకుంటే ఏప్రిల్ 27 నుంచి రెడీగా ఉండండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More