షాకింగ్.. వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్
తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి రావడం షాక్‌కు గురి చేస్తోంది. గత వారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. శుక్రవారం (నవంబర్ 28) అసలు ఎలాంటి సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగులో గతవారం థియేటర్లలో రిలీజైన సినిమాల్లో ఒకటి పాంచ్ మినార్ (Paanch Minar). రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఐఎండీబీలోనూ 9.3 రేటింగ్ సాధించింది. అయినా వారం రోజుల్లోనే ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయాలన్న మేకర్స్ నిర్ణయం షాక్‌కు గురి చేస్తోంది.
షాకింగ్.. వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్
పాంచ్ మినార్ ఓటీటీ స్ట్రీమింగ్
రాజ్ తరుణ్, రాశీ సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ పాంచ్ మినార్. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. సరిగ్గా వారం రోజుల్లోనే అంటే శుక్రవారం (నవంబర్ 28) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
రామ్ కుడుముల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర అసలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో మేకర్స్ సరిగ్గా ఏడు రోజుల్లోనే మూవీని స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఓటీటీలో అయినా ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందేమో చూడాలి.
పాంచ్ మినార్ మూవీ గురించి..
ఈ మధ్యే ఆహా ఓటీటీలోకి చిరంజీవ సినిమాతో వచ్చిన రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా పాంచ్ మినార్. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించాడు. బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇదో చిన్న రొటీన్ స్టోరీనే. కానీ చూస్తున్నంత సేపు నవ్వించేలా ఉంటుంది. ఉద్యోగానికి బదులు ఈజీగా డబ్బు సంపాదించాలనుకునే ఓ యువకుడు ఎలాంటి కష్టాలు కొనితెచ్చుకున్నాడు, ఏ సమస్యలను ఎదుర్కొన్నాడు అన్నదే పాంచ్ మినార్ కథ.
క్రైమ్ కామెడీ జోనర్‌కు తగినట్లుగా సినిమాలో కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓ వైపు నటీనటుల నుంచి కామెడీని రాబట్టుకున్న దర్శకుడు మరోవైపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బాగా వచ్చేలా రాసుకున్నాడు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఐఎండీబీలో 9.3 రేటింగ్ ఇచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా పడింది. ఓటీటీలో చిరంజీవతో సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్ కు ఈ పాంచ్ మినార్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. మరి ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
News/Entertainment/షాకింగ్.. వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్
News/Entertainment/షాకింగ్.. వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.3 రేటింగ్