తెలుగులో ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రముఖ నటి వర్ష బొల్లమ్మ లీడ్ రోల్లో నటించిన సిరీస్ ఇది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. తమ కథను కానీ కొట్టారంటూ మరో ఓటీటీలోని వెబ్ సిరీస్ పై ఆరోపణల ద్వారా ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ వస్తుండటం ఆసక్తి రేపుతోంది.
కానిస్టేబుల్ కనకం రెండో సీజన్

ఈటీవీ విన్ ఓటీటీ నుంచి వచ్చిన హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం నుంచి రెండో సీజన్ వస్తోంది. వచ్చే నెలలోనే దీనిని తీసుకురానున్నట్లు మంగళవారం (నవంబర్ 4) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. “మీరు మళ్లీ చూస్తున్నారు. మేము మిమ్మల్ని చూస్తున్నాం. కనకం వచ్చే నెలలో డబుల్ ఫైర్ తో మళ్లీ వస్తోంది. సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఆ పోస్టర్ పై కూడా టెక్ట్స్ రాసి ఉంది. అందులో ఇలా ఉంది.. “మీరందరూ కానిస్టేబుల్ కనకంను మళ్లీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి వ్యూ, ప్రతి మెసేజ్, చంద్రిక ఎక్కడ అనే ప్రతి మాట దీనిని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. కానీ స్టోరీ ఇక్కడితో ముగియలేదు.. మరికొన్ని రోజు వేచి చూడండి.. ఎందుకంటే రెండో సీజన్ వచ్చే నెలలో వస్తోంది. థ్రిల్స్, మిస్టరీ, ఎమోషన్స్ ని డబుల్ చేయడానికి వచ్చేస్తోంది.. తుఫాను కోసం సిద్ధంగా ఉండండి” అని ఈటీవీ విన్ పోస్ట్ చేసింది.
కానిస్టేబుల్ కనకం గురించి..
కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ సుమారు మూడు నెలల కిందట ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కానిస్టేబుల్ దిమ్మల కనక మహాలక్ష్మి అనే పాత్రలో వర్ష బొల్లమ్మ నటించింది. హెడ్ కానిస్టేబుల్ గా సీనియర్ నటుడు రాజీవ్ కనకాల కనిపించాడు.
{{/usCountry}}కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ సుమారు మూడు నెలల కిందట ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కానిస్టేబుల్ దిమ్మల కనక మహాలక్ష్మి అనే పాత్రలో వర్ష బొల్లమ్మ నటించింది. హెడ్ కానిస్టేబుల్ గా సీనియర్ నటుడు రాజీవ్ కనకాల కనిపించాడు.
{{/usCountry}}ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేశాడు. తొలి సీజన్ లో ఆరు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ఓ ఊళ్లో కొత్తగా పెళ్లయిన అమ్మాయి మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుండటంతో మరింత ఆసక్తి రేపుతోంది.