Telugu Web Series: 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్.. ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు
ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ (telugu crime thriller web series) డాటరాఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు దూసుకెళ్తోంది. 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకోవడం విశేషం.
ఓటీటీలోకి తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాటరాఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఉదయభానులాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాస్తోంది.

డాటరాఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు స్ట్రీమింగ్
జీ5 ఓటీటీలోకి గత శుక్రవారం (ఫిబ్రవరి 27) అడుగుపెట్టిన వెబ్ సిరీస్ డాటరాఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు చాలా రోజుల నుంచే మేకర్స్ మంచి ప్రమోషన్స్ నిర్వహించారు. దీనికితోడు ఇందులోని థ్రిల్లింగ్ కంటెంట్ కూడా బాగా నచ్చడంతో వచ్చీ రాగానే ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో తొలి 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసినట్లు జీ5 వెల్లడించింది.
“75 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్. ప్రసాద్ రావు, అతని కూతురు ఇంటర్నెట్‌లో తుఫాను క్రియేట్ చేస్తున్నారు. డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా 75 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సిరీస్ స్పెషల్ షో వేశారు. ఇందులో 1000 మందికి పైగా స్టూడెంట్స్ తొలి రెండు ఎపిసోడ్లను చూడటం విశేషం.
డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుట లేదు విశేషాలు
ఈ వెబ్ సిరీస్ టైటిల్ సూచించినట్లుగానే ప్రసాదరావు అనే ఒక రిటైర్డ్ మధ్యతరగతి వ్యక్తి కూతురు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కథ మొదలవుతుంది. సాధారణంగా ఒక అమ్మాయి కనిపించకపోతే అది కేవలం మిస్సింగ్ కేసు అనుకుంటాం. కానీ ఆమె అదృశ్యం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితంలో ఉన్న రహస్యాలు, ఆమె కనిపించకుండా పోవడానికి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనేది అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ కేసును ఛేదించే క్రమంలో బయటపడే చేదు నిజాలు, కుటుంబ సంబంధాల మధ్య ఉండే లోపాలను దర్శకుడు చాలా సహజంగా చూపించారు. ఈ సిరీస్‌లో పేరున్న నటులతో పాటు ప్రతిభావంతులైన కొత్తవారు కూడా నటించారు. ప్రసాదరావు పాత్రలో సీనియర్ నటుడు రాజీవ్ కనకాల నటించగా.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉదయభాను కనిపించింది.
మన చుట్టూ ఉన్న కాలనీల్లో జరిగే కథలా అనిపిస్తుంది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కథ మొదట్లో నెమ్మదిగా సాగినా, ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ ఊపందుకున్నాక ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠను పెంచుతుంది. ఊహించని మలుపులతో ముగిసే క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


