BVS Ravi: ధురంధ‌ర్‌ను చూసి నేర్చుకోవాలి.. లేదంటే తెలుగు నిర్మాత‌ల క‌థ ముగిసిన‌ట్లే.. బీవీఎస్ ర‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

BVS Ravi: బాలీవుడ్ సెన్సేషన్ 'ధురంధర్' చిత్రాలపై ప్రముఖ తెలుగు రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా మేకింగ్ విధానం, బడ్జెట్ మేనేజ్‌మెంట్ చూస్తుంటే తెలుగు నిర్మాతలకు గడ్డుకాలం మొదలైనట్టేనని ఆయన హెచ్చరించాడు.

Published on: Apr 7, 2026, 09:33:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో 'ధురంధర్' నామస్మరణ మారుమోగిపోతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయంపై టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్, నటుడు బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బీవీఎస్ రవి కామెంట్లు
బీవీఎస్ రవి కామెంట్లు

బీవీఎస్ రవి కామెంట్లు

ధురంధర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ధురంధర్ 1, ధురంధర్ 2 కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ మూవీస్ సక్సెస్ పై బీవీఎస్ రవి స్పందించాడు. ధురంధర్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే, పాతకాలపు పద్ధతుల్లో సినిమాలు తీసే తెలుగు నిర్మాతలకు ఇది ముగింపునకు ఆరంభం అని రవి పేర్కొన్నాడు.

ఆదిత్య ధర్ విజన్ కు హ్యాట్సాఫ్

ఒక ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ, ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ తన విజన్ తో అందరినీ ఎలా ఒప్పించగలిగారనే అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "ధురంధర్ సినిమాలను చూడండి.. ఆదిత్య దాదాపు 8 గంటల నిడివి గల కథను (రెండు భాగాలుగా) అద్భుతంగా తెరకెక్కించారు. దీని కోసం ఆయన ఎంతటి పరిశోధన చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి సన్నివేశాన్ని లాజికల్‌గా మలిచారు.

అంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయన విజన్‌ను నమ్మడం, అంత భారీ బడ్జెట్ పెట్టేలా నిర్మాతలను ఒప్పించడం సామాన్యమైన విషయం కాదు" అని రవి కొనియాడాడు.

రూ.260 కోట్లతోనే

తెలుగు చిత్ర పరిశ్రమలో బడ్జెట్ ఖర్చు చేసే విధానంపై బీవీఎస్ రవి ఘాటైన విమర్శలు చేశాడు. "సృజనాత్మకతను పక్కన పెడితే, రెగ్యులర్ నిర్మాతలకు ధురంధర్ సినిమాలు ఒక హెచ్చరిక. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణం.. విదేశాల్లో భారీ సెట్లు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నప్పటికీ, ఈ రెండు భాగాలను కలిపి కేవలం రూ. 260 కోట్ల బడ్జెట్‌తోనే పూర్తి చేశారు’’ అని రవి అన్నాడు.

టాలీవుడ్ బడ్జెట్

టాలీవుడ్ సినిమాల బడ్జెట్ పైనా బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన దగ్గర చిన్న సినిమాలకే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. మనం కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ లేనిదే సినిమా మొదలుపెట్టలేని స్థితిలో ఉన్నాం" అని రవి పేర్కొన్నాడు.

సినిమా ఖర్చులు పెరగడానికి హీరోల రెమ్యునరేషన్లే కారణమా? అని ప్రశ్నించగా.. రవి దాన్ని తోసిపుచ్చారు. అసలు లోపం నిర్మాత ప్రణాళికలో ఉందన్నారు. షూటింగ్ మొదలవ్వక ముందే పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లే తెలుగు సినిమాల వ్యయం అనవసరంగా పెరుగుతోందని ఆయన విశ్లేషించాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More