Raakaasa: బ్లాక్‌బస్టర్ దిశగా రాకాస-మెగా డాటర్ నిహారిక ఖాతాలో మరో విక్టరీ-అదిరే కలెక్షన్లు-మూవీ బడ్జెట్ ఎంతంటే?
Raakaasa: హారర్ కామెడీ థ్రిల్లర్ రాకాస అదరగొడుతోంది. ఆడియన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తూ కలెక్షన్ల మోత మోగిస్తోంది. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్లు, బడ్జెట్ గురించి తెలుసుకోండి.
నేటి జనరేషన్ కు తగ్గట్లు చందమామ కథలా హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్లతో వచ్చిన ‘రాకాస’ మూవీ థియేటరల్లో అదరగొడుతోంది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్లలో దూసుకెళ్తోంది. బ్లాక్ బస్టర్ గా నిలిచే దిశగా సాగిపోతోంది. ప్రొడ్యూసర్ గా మెగా డాటర్ నిహారిక ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాకాస కలెక్షన్లు
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్లు కలెక్షన్ల దూకుడుతో సాగిపోతోంది. శుక్రవారం (ఏప్రిల్ 3) రిలీజైన ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.10.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఫన్ బ్లాక్ బస్టర్
రాకాస సినిమాను ఉమేశ్ కుమార్ (జీ స్టూడియోస్)తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది. ‘‘ఇది కేవలం సినిమా రన్ మాత్రమే కాదు. థియేటర్లలో ఇది పండగ. రాకాస కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.10.30 కోట్ల కలెక్షన్లు దాటింది. విజిల్స్, నాన్ స్టాప్ నవ్వులతో మూవీ సాగుతోంది’’ అని నిహారిక ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ ఇన్ స్టాలో పోస్టు చేసింది.
రాకాస బడ్జెట్
రాకాస సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు. ఈ మూవీ కోసం రూ.15 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. ఇక మూవీకి రూ.12.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
లాభాల్లోకి రావాలంటే?
రాకాస సినిమా పాజిటివ్ టాక్ తో సాగిపోతోంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.13.5 కోట్ల నెట్, రూ.27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రాకాస మూవీ జోరు చూస్తుంటే ఈ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని చెప్పొచ్చు.
ఫుల్ ఎంటర్ టైనర్
సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలోకి వచ్చిన రాకాసకు ఆడియన్స్ జై కొడుతున్నారు. హారర్ కామెడీతో ఈ మూవీ భయపెడుతూనే నవ్విస్తోంది. మంచి ఎంటర్ టైనర్ చూడాలనుకునేవాళ్లకు రాకాస మంచి ఆప్షన్. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
చాలా రోజుల తర్వాత థియేటర్లలో ఓ మంచి ఎంటర్ టైనర్ రూపంలో రాకాస వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాకాస సినిమా వసూళ్లు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కమిటీ కుర్రోళ్లు తర్వాత ప్రొడ్యూసర్ గా రాకాసతో నిహారికకు మరో హిట్ ఖాయమని అంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


