OTT Release: ఓటీటీలో థ్రిల్లర్లకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు తెలుగు మిస్టరీ హారర్ థ్రిల్లర్ ‘అగధ’ కూడా అదే రేంజ్ లో ఓటీటీని షేక్ చేస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా సత్తాచాటుతోంది. కేవలం 3 రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసిందని ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.
అగధ ఓటీటీ

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన తాజా మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగధ' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు కొల్లగొడుతోంది. సెప్టెంబర్ 25న జీ5 (ZEE5) ఓటీటీలో అడుగుపెట్టిన ‘అగధ’.. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కించుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.
కథ ఏంటంటే..
అగధ మూవీ ఓ సూపర్‌నేచురల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్. ఆధ్యాత్మిక శక్తులున్న మహాదేవి అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కజిన్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో, ఆ మిస్టరీని ఛేదించేందుకు మహాదేవి తన సొంత ఊరికి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక నిషేధిత అడవిలోకి, అలాగే ఒక రహస్య గుహలోకి ప్రవేశిస్తుంది.
పన్నెండు చేతుల విగ్రహం
అక్కడ పన్నెండు చేతులున్న ఒక విగ్రహం, అలాగే 'అగధ' అనే ఒక దుష్టశక్తి ఆమెకు ఎదురవుతాయి. ఆ దుష్టశక్తి బారి నుంచి తన కుటుంబాన్ని మహాదేవి ఎలా కాపాడుకుంది, మంచికి - చెడుకు మధ్య జరిగిన ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అనేది మిగతా కథ. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగడంతో పాటు మధ్యలో వచ్చే ట్విస్ట్ లు, విజువల్స్ మరింత ఉత్కంఠ కలిగిస్తాయి.
కామాక్షి భాస్కర్ల అదుర్స్
అగధ చిత్రంలో కామాక్షి భాస్కర్ల (మహాదేవి పాత్రలో), శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు రోషన్ బషీర్, భానుచందర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే కామాక్షి భాస్కర్ల తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. అందుకే ఈ మూవీని జనాలు తెగ చూసేస్తున్నారు.
{{/usCountry}}అగధ చిత్రంలో కామాక్షి భాస్కర్ల (మహాదేవి పాత్రలో), శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు రోషన్ బషీర్, భానుచందర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే కామాక్షి భాస్కర్ల తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. అందుకే ఈ మూవీని జనాలు తెగ చూసేస్తున్నారు.
{{/usCountry}}హారర్, మిస్టరీ జానర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఎం.ఎస్. రాజు టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం బాగా కనెక్ట్ అవుతున్నాయి. హారర్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ జీ5లో అందుబాటులో ఉన్న ఈ మిస్టిక్ థ్రిల్లర్‌ను చూసి థ్రిల్ ఫీల్ అవ్వొచ్చు.