...
...
Next Story

ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. అన్ని సినిమాలూ ఒకేలా ఉండవంటూ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

ఓటీటీలోకి ఓ డిఫరెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. అన్ని సినిమాలూ ఒకేలా ఉండవంటూ జాంబీ జానర్లోనే ఇప్పటి వరకూ చూడని విధంగా థ్రిల్ పంచుతుందని మేకర్స్ ఈ మూవీ గురించి చెప్పారు.

Published on: Jan 8, 2026, 19:20:55 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

హారర్ థ్రిల్లర్.. అందులోనూ జాంబీల బ్యాక్‌డ్రాప్ లో ఎన్నో సినిమాలు మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడో డిఫరెంట్ థ్రిల్లర్ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు డ్యుయల్ (Dual). నాట్ ఆల్ ద మూవీస్ ఆర్ సేమ్ (Not All The Movies Are Same) అంటూ ఈ సినిమా గతేడాది వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

డ్యుయల్ ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. అన్ని సినిమాలూ ఒకేలా ఉండవంటూ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. అన్ని సినిమాలూ ఒకేలా ఉండవంటూ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

తెలుగులో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ఈ డ్యుయల్. గతేడాది థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు శుక్రవారం అంటే జనవరి 9 నుంచి ఏకంగా ఐదు భాషల్లో లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రానుంది. జాంబీల బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 8.7 రేటింగ్ ఉండటం విశేషం.

డ్యుయల్ సినిమా విశేషాలు..

టాలీవుడ్‌లో మరో ప్రయోగాత్మక సినిమా ఇది. సురేష్ సాగిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్ ‘నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్: డ్యుయల్’. అదృష్టం తెచ్చే దురాశ, దాని వెనుక దాగి ఉన్న భయంకరమైన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సాధారణ భయపెట్టే శబ్దాలు కాకుండా, మైండ్ గేమ్స్‌తో భయపెట్టే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. జనవరి 9 నుండే స్ట్రీమింగ్ మొదలుకానుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మారుమూల గ్రామం, పక్కనే ఉన్న సరస్సు.. ఈ ప్రశాంతమైన వాతావరణంలో కథ మొదలవుతుంది. స్థానికంగా ఉండే ఒక జాలరి జీవితంలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. మొదట అది అదృష్టం అనుకుంటాడు కానీ, రాను రాను అది ఒక పీడకలగా మారుతుంది.

ఈ డ్యుయల్ మూవీలో వల్లభ్ తేజ, రోష్ని అరవిందాక్షన్, రఘు వర్ధన్, ఖుషి పిల్లల, సౌందర్య రామ్ దాస్ తదితరులు నటించారు. ఈ మూవీ గురించి గతంలో హీరో వల్లభ్ తేజ మాట్లాడాడు. "ఇది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు. ఇందులో సైకలాజికల్ డ్రామా, సర్వైవల్ హారర్, ప్యారలల్ వరల్డ్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. తప్పు చేశాక కలిగే గిల్ట్, బతకడానికి చేసే పోరాటం నా పాత్రలో కనిపిస్తాయి" అని అన్నాడు. దర్శకుడు సురేష్ మాట్లాడుతూ.. "ఇదొక హై-కాన్సెప్ట్ సినిమా. కేవలం భయపెట్టడమే కాకుండా.. బాధ్యత, మానవ సంబంధాల గురించి చర్చిస్తుంది" అని చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe