మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. నలుగురు ఫ్రెండ్స్.. మూడు రోజులు ఓ పాడుబడిన ఇంట్లో..

తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజైన ఈ మూవీ.. మరికొన్ని గంటల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. హెబ్బా పటేల్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

Published on: Feb 19, 2026, 20:29:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లేటెస్ట్ తెలుగు హారర్ థ్రిల్లర్ 'ఈషా' (Eesha) ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అది కేవలం ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రమే. కానీ ఇప్పుడు ఇండియాలోనూ డిజిటల్ ప్రీమియర్ కానుంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచి ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. నలుగురు ఫ్రెండ్స్.. మూడు రోజులు ఓ పాడుబడిన ఇంట్లో..
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. నలుగురు ఫ్రెండ్స్.. మూడు రోజులు ఓ పాడుబడిన ఇంట్లో..

విదేశాల్లో ముందే స్ట్రీమింగ్..

హెబ్బా పటేల్ (Hebah Patel) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'ఈషా' థియేట్రికల్ రిలీజ్‌కు ముందు మంచి ప్రమోషన్స్‌తో బజ్ క్రియేట్ చేసింది. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో.. బుధవారం అంటే ఫిబ్రవరి 18 నుంచే ఇండియా బయట ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. అయితే ఇండియాలో స్ట్రీమింగ్ కాకపోవడంతో ఇక్కడి ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలు ఈ సినిమా ఇక్కడ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది..

ఆ నిరీక్షణకు తెరదించుతూ మూవీ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ద్వారా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఈషా' సినిమా ఫిబ్రవరి 20 నుంచి ప్రైమ్ వీడియో ఇండియాలో స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా తెలుగులో సినిమాలకు నాలుగు వారాల ఓటీటీ విండో ఉంటుంది.

కానీ ఈ సినిమాకు దాదాపు ఎనిమిది వారాల గ్యాప్ రావడం అరుదైన విషయం. ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ గురించి మాత్రమే సమాచారం ఉంది. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈషా మూవీ స్టోరీ, విశేషాలు

నలుగురు స్నేహితులు ఒక దొంగ బాబాను ఎదిరించడానికి, దెయ్యాలు లేవని నిరూపించడానికి ఒక పాడుబడిన ఇంట్లో మూడు రోజులు గడపడానికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్లకు ఎలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌తో పాటు ఆదిత్ అరుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More