ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. ఇవాళ్టి నుంచి మరో మూడు భాషల్లో అందుబాటులోకి..
ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి రికార్డులు తిరగరాస్తోంది. అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ మూవీ.. థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా సత్తా చాటుతోంది.
హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి ఊహించినట్లే ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. శుక్రవారం (అక్టోబర్ 24) నుంచి తెలుగు కాకుండా మరో మూడు భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. తొలి వారంలోనే అరుదైన 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.

కిష్కింధపురి స్ట్రీమింగ్ రికార్డు
అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి మూవీ థియేటర్లలో సుమారు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడీ సినిమా జీ5 ఓటీటీలో రికార్డులు తిరగరాస్తోంది. గత శుక్రవారం అంటే అక్టోబర్ 17న డిజిటల్ ప్రీమియర్ కాగా.. తొలి వారంలోనే 100 మిలియన్ల అంటే 10 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది.
అది కూడా కేవలం తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతూనే ఈ స్థాయిలో చెలరేగింది. ఇక శుక్రవారం (అక్టోబర్ 24) నుంచి తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది.
కిష్కింధపురి మూవీ గురించి..
వణికించే హారర్ థ్రిల్లర్ గా కిష్కింధపురి తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్. సాహు గారపాటి నిర్మించాడు.
సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ లో ఉన్న వేదవతి దెయ్యం, దాని నుంచి పాపను కాపాడటం చుట్టూ కిష్కింధపురి కథ తిరుగుతుంది. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లవర్స్. వీళ్లిద్దరు మరో ఫ్రెండ్ తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో టూర్స్ నిర్వహిస్తారు. పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లి, అక్కడ దెయ్యాలున్నాయని నమ్మించి వచ్చిన వాళ్లకు థ్రిల్ పంచుతారు.
ఈ క్రమంలోనే కిష్కింధపురి గ్రామానికి దగ్గర్లోనే పాడుబడ్డ సువర్ణ మాయ అనే రేడియో స్టేషన్ కు 11 మందిని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లాక పరిస్థితులు తారుమారవుతాయి. అక్కడ రేడియోలో నుంచి ఓ వాయిస్ వినిపిస్తుంది. అది దెయ్యం వేదవతి వాయిస్ అని తెలుస్తుంది. ఆ దెయ్యం 11 మందిలో ఎవరినీ వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి ముగ్గురిని చంపేస్తుంది. ఆ తర్వాత ఓ పాపను చంపాలని చూస్తుంది. కానీ రాఘవ్ పాపను కాపాడటం కోసం దెయ్యానికి ఎదురు వెళ్తాడు.
మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దెయ్యంగా మారిన వేదవతి కథ ఏంటీ? ఎందుకు జనాలను చంపుతుంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కు కిష్కింధపురి బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


