...
...
Next Story

OTT Horror Thriller: ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఐదు రోజుల్లోనే అరుదైన మైలురాయి అందుకున్న సినిమా

ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ దుమ్ము రేపుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఐదు రోజుల్లోనే అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మూవీ పేరు శంబాల. ఆది సాయికుమార్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలోలాగే ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.

Published on: Jan 26, 2026, 15:54:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగులో గతేడాది చివర్లో వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల (Shambhala). ఆది సాయికుమార్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

శంబాల 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్

OTT Horror Thriller: ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఐదు రోజుల్లోనే అరుదైన మైలురాయి అందుకున్న సినిమా
OTT Horror Thriller: ఓటీటీలో తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ దూకుడు.. ఐదు రోజుల్లోనే అరుదైన మైలురాయి అందుకున్న సినిమా

ఆది సాయికుమార్ లీడ్ రోల్లో నటించిన శంబాల మూవీ ఆహా వీడియోలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది. ఓటీటీలోకి అడుగు పెట్టిన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. “50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్. ఒక భయపెట్టే స్టోరీ. ఆది శంబాల కేవలం ఆహాలో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. గత వారం ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.

రూ. 10 కోట్ల జాక్‌పాట్ డీల్..

ఈ శంబాల సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆది సాయికుమార్ కెరీర్‌లోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సినిమా ఇదే. ‘ఆహా వీడియో’ ఓటీటీ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనివల్ల సినిమా థియేటర్లలో విడుదల కాకముందే నిర్మాతలు లాభాల బాట పట్టారు.

శంబాల కథేంటంటే?

ఆకాశం నుంచి ఊడిపడిన ఒక దుష్టశక్తి ఒక గ్రామాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. గ్రామస్తుల శరీరంలోకి ప్రవేశించి, వారి మెడల ద్వారా బయటకు వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. అసలు ఆ శక్తి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఒక సైంటిస్ట్‌ దాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే ఈ సినిమా కథ.

హారర్ థ్రిల్లర్స్‌కు మంచి మిస్టరీని యాడ్ చేసి తెరకెక్కిస్తే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. శంబాల కూడా అదే ట్రాక్‌లో రూపొందిన సినిమా. ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టించే సీన్స్, ఉత్కంఠభరితమైన ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్‌లు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి.

సినిమా నిండా దర్శకుడు హై మూమెంట్స్‌ను తెలివిగా పొందుపరిచాడు. క్లైమాక్స్ వరకు కథను గాడి తప్పకుండా నడిపించడంలో డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. అయితే క్లైమాక్స్ ఫర్వాలేదనిపిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks