Haiku Trailer: లేడీస్ కాలేజీలో ఒక్క మగాడు.. కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ హైకూ ట్రైలర్.. లవ్ ట్రయాంగిల్

Haiku Trailer: కోర్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన శ్రీదేవి హీరోయిన్ గా వస్తున్న తమిళ మూవీ హైకూ ట్రైలర్ వచ్చేసింది. నవ్విస్తూనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఎమోషనల్ గానూ సాగిన ఈ ట్రైలర్.. అక్టోబర్ 23న రిలీజ్ కానున్న మూవీపై అంచనాలు పెంచేసింది.

Published on: Oct 6, 2026, 20:40:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Haiku Trailer: కోలీవుడ్ యంగ్ టాలెంట్ ఏగన్, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్, మన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి ఆపల్ల లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన క్యూట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'హైకూ' (Haiku) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ అక్టోబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి రూపొందించిన ఈ డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.

Haiku Trailer: లేడీస్ కాలేజీలో ఒక్క మగాడు.. కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ హైకూ ట్రైలర్.. లవ్ ట్రయాంగిల్
Haiku Trailer: లేడీస్ కాలేజీలో ఒక్క మగాడు.. కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ హైకూ ట్రైలర్.. లవ్ ట్రయాంగిల్

యూత్‌ను ఆకట్టుకునే లవ్, ఫన్ రైడ్

ఈ రోజుల్లో ఆడియన్స్‌కి ఫ్రెష్ ఫీల్ ఇచ్చే రొమాంటిక్ కాన్సెప్ట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డాక్టర్ డి. అరుణలాంధు, మ్యాథ్యూ అరుణలాంధు నిర్మాతలుగా నిర్మించిన 'హైకూ' చిత్రం యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ప్రతీ ఫ్రేమ్ చాలా కలర్‌ఫుల్‌గా, లవ్‌లీ విజువల్స్‌తో సాగిపోతోంది. హీరో ఏగన్, కథానాయికలు శ్రీదేవి ఆపల్లా, ఫెమినా జార్జ్ మధ్య ఉండే కెమిస్ట్రీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లైన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ ట్రైలర్ మొదట్లోనే లేడీస్ కాలేజీలో చేరే హీరోని పరిచయం చేస్తారు. తన క్లాస్ లోనే కాదు.. మొత్తం కాలేజీలోనే ఉన్న ఏకైక అబ్బాయిగా అతని కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. అలాంటి టైమ్ లో కాలేజీ నుంచి వెళ్లిపోదామనుకుంటుండగా.. అతని జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే అతని జీవితంలో అప్పటికే మరో అమ్మాయి కూడా ఉండటంతో అక్కడి నుంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలవుతుంది.

డెబ్యూ డైరెక్టర్ విజన్..

కొత్త డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, హరిహరన్ రామ్‌తో కలిసి స్క్రీన్‌‌ప్లే సమకూర్చారు. మొదటి సినిమానే అయినప్పటికీ నటీనటుల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

సిద్ధు కుమార్ అందించిన మ్యూజిక్, ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. శక్తి ప్రాణేష్ ఎడిటింగ్ కట్ చూస్తుంటే క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్, కామెడీ సీన్స్ చాలా పేసీగా సాగినట్లు అర్థమవుతోంది. సపోర్టింగ్ రోల్స్‌లో ఆదిర్చి అరుణ్, సుబ్రమణియ సేతు, అధియమాన్, మైమ్ గోపి, ఇంధుమతి మణిగండన్ తమ మార్క్ నటనతో అలరించనున్నారు.

తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్

ఈ హైకూ మూవీని తమిళంతో పాటు తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అక్టోబర్ 23న భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ఎంటర్‌టైనింగ్ కామెడీ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు 'హైకూ' ఒక పర్ఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

పండుగ వాతావరణంలో వస్తున్న ఈ రొమాంటిక్ రైడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ రిలీజ్ కు ముందే సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More