...
...
Next Story

OTT Telugu: విలేజీ లవ్ డ్రామా.. కేఫ్ చుట్టూ తిరిగే స్టోరీ.. ఇవాళ ఒకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఓ లుక్కేయండి

OTT Telugu: తెలుగు ఓటీటీ లవర్స్ అలర్ట్. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఈ రోజు రెండు క్రేజీ తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇందులో ఒకటి విలేజ్ డ్రామా, మరొకటి కేఫ్ చుట్టూ తిరిగే స్టోరీ. పూర్తి వివరాలపై లుక్కేయండి.

Published on: May 29, 2026, 12:03:58 IST
Advertisement

OTT Telugu: ఓటీటీలోకి తెలుగు సినిమాలు వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ జోనర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. ఇవాళ కూడా ఓ రెండు స్పెషల్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడం కోసం డిజిటల్ డెబ్యూ చేశాయి. ఆ సినిమాలే.. ‘గోదారి గట్టుపైన’, ‘నవాబ్స్ కేఫ్’. ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ గురించి ఇక్కడ చూసేయండి.

గోదారి గట్టుపైన

ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాాలు
ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాాలు

‘మేం ఫేమస్’ మూవీతో ఆడియన్స్ ను అలరించిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’. గోదావరి జిల్లాలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే విలేజ్ లవ్ డ్రామా ఇది. ఈ చిత్రం ఇవాళ (మే 29) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది.

మూవీ స్టోరీ

గోదారి గట్టుపైన సినిమాలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా తదితరులు నటించారు. ఈ మూవీకి సుభాష్ చంద్ర డైరెక్టర్. పదో క్లాస్ లోనే చదువు ఆపేసి ఆటో డ్రైవర్ గా మారిన రాజు (సుమంత్ ప్రభాస్) ఇంజనీరింగ్ చదువుతున్న మాయ (నిధి)ను లవ్ చేస్తాడు. మాయ కూడా రాజు ప్రేమలో పడిపోతుంది.

ఆ ట్విస్ట్

అయితే కూతురు మాయ అంటే తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు)కు పంచ ప్రాణాలు. గొప్ప స్థాయిలో ఉన్న అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఆటో డ్రైవర్ ను మాయ ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? మాయ, రాజుల పెళ్లి జరిగిందా? అన్నది గోదారి గట్టుపైన మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

నవాబ్స్ కేఫ్

హైదరాబాద్ లోని పాతబస్తీలో రంగనాథ్ (రాజీవ్ కనకాల)కు ‘నవాబ్స్ కేఫ్’ ఉంటుంది. అది వారసత్వంగా వచ్చింది. తన కొడుకు రాజా (శివ కందుకూరి) కూడా ఆ కేఫ్ ను రన్ చేయాలని రంగనాథ్ కోరుకుంటాడు. కానీ రాజా మాత్రం ఆ కేఫ్ ను అమ్మేయాలని చూస్తాడు. ఈ పరిస్థితుల్లో రంగనాథ్ చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే నవాబ్స్ కేఫ్ మిగతా స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks