...
...
Next Story

OTT Thriller: చనిపోయిన కూతురి కోసం నరబలి..లాస్ట్ 30 మినిట్స్ వేరే లెవల్..ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్

OTT Thriller: థియేటర్లలో ఫ్లాప్ అయిన మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా నిలిచింది ఈ మూవీ. ఈ చిత్రం విశేషాలపై ఓ లుక్కేయండి.

Published on: Sep 27, 2026, 16:20:03 IST
Advertisement

OTT Thriller: ఓటీటీలో థ్రిల్లర్లకు కొదవలేదు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, క్రైమ్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ జోనర్ థ్రిల్లర్లు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘కర్మాఖ్య’ ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

ఓటీటీ ట్రెండింగ్

చనిపోయిన కూతురి కోసం నరబలి..లాస్ట్ 30 మినిట్స్ వేరే లెవల్..ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ (jiohotstar)
చనిపోయిన కూతురి కోసం నరబలి..లాస్ట్ 30 మినిట్స్ వేరే లెవల్..ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ (jiohotstar)

కర్మాఖ్య మూవీ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. చనిపోయిన తమ కూతురిని తిరిగి బతికించుకోవడం కోసం ఓ అమ్మాయిని నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించే ఓ కుటుంబం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ మూవీ ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో తెలుగులో సినిమాల్లో ఇదే ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

అదరగొట్టే సస్పెన్స్

కర్మాఖ్య మూవీకి థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. జబర్దస్త్ లో అదిరే అభిగా పేరు తెచ్చుకున్న కమెడియన్ అభినయ్ కృష్ణ‌ డైరెక్టర్ గా మారి కర్మాఖ్య మూవీని తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ మూవీ సస్పెన్స్ తో ఓటీటీ ఆడియన్స్ ను ఊపేస్తోంది. ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాల మూవీ మరో లెవల్ లో ఉందని చెప్పొచ్చు.

స్టోరీ ఏంటంటే?

చనిపోయిన మనిషిని బతికించడం కోసం ఓ క్షుద్రపూజ ఉందని ఈ కర్మాఖ్య మూవీలో చూపిస్తారు. ఆ పూజ కోసం పక్కాగా ఓ ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని బలి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అదే టైమ్ లో ఓ పాప పుట్టేలా చేస్తారు. కానీ ఆ పూజ పూర్తికాకుండానే ఆ మాంత్రికుడి కుటుంబాన్ని చంపేస్తారు.

అక్కడికి వెళ్లిన ఫ్రెండ్ ను నరబలి చేసేందుకు ఆ కుటుంబం ప్లాన్ చేస్తుంది. ఇంట్లో బంధిస్తుంది. పూజకు సిద్ధం చేసిన సమయంలో ఆ అమ్మాయి పారిపోతుంది. కానీ అక్కడే ఓ మైండ్ బ్లాక్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. చివరకు ఆ అమ్మాయిని పూజలో పడుకోబెడతారు. మరి ఆ అమ్మాయిని చంపారా? ఆమె ఎలా తప్పించుకుంది? అనేది కర్మాఖ్య మూవీలో చూడాల్సిందే.

ఈ సినిమాలో అభిరామి, సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్లు నటించారు. వీళ్లు తమ ప్రదర్శనతో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి థ్రిల్లర్, ముఖ్యంగా లాస్ట్ 30 మినిట్స్ సస్పెన్స్ తో ఊపేసే సినిమా చూడాలనుకునేవాళ్లకు ఈ కర్మాఖ్య మంచి ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks