Feel Good Movie: ఫీల్ గుడ్ మూవీ నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్.. ఆధునిక పదాలతో ఆకట్టుకుంటున్న మమ్మా మియా పాట!

Feel Good Movie Mamma Mia Song Released: సుచిత్, అదితి త్రిపాఠి జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం 'ఫీల్ గుడ్' నుంచి 'మమ్మా మియా' పాట విడుదలయింది. శాండిల్య పిసపాటి స్వరపరిచిన ఈ యూత్‌ఫుల్ లవ్ ట్రాక్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆధునిక పదాలతో స్వరపరిచిన ఈ సాంగ్ వైరల్ అవుతోంది.

Published on: Oct 24, 2026, 18:13:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Feel Good Movie Mamma Mia Song Released: టాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం 'ఫీల్ గుడ్'. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలను దయానంద్ చేపట్టారు. విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఫీల్ గుడ్ మూవీ నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్.. ఆధునిక పదాలతో ఆకట్టుకుంటున్న మమ్మా మియా పాట!
ఫీల్ గుడ్ మూవీ నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్.. ఆధునిక పదాలతో ఆకట్టుకుంటున్న మమ్మా మియా పాట!

మమ్మా మియా సాంగ్ రిలీజ్

ఫీల్ గుడ్ చిత్రంలో సుచిత్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాను కథానాయకుడు సుచిత్ స్వయంగా నిర్మించడం విశేషం. ఇక ఫీల్ గుడ్ మూవీలో హీరో సుచిత్‌కు జోడీగా అదితి త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఫీల్ గుడ్ నుంచి మేకర్స్ తాజాగా 'మమ్మా మియా' అనే మధురమైన లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ

విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ మమ్మా మియా పాట సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. సంగీత ప్రియులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ పాటలో నటీనటుల మధ్య కెమిస్ట్రీ, ఉత్సాహభరితమైన సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రేమ, స్నేహం, సరదా సన్నివేశాల మేళవింపుతో పాటను మధురంగా చిత్రీకరించారు.

యువత మెచ్చేలా సాగే సాహిత్యం

నేటి తరం యువత మాట్లాడే సంభాషణలు, వారి భావాలకు అద్దం పట్టేలా ఈ పాటను మలిచారు. వైబ్, సింక్, ట్రెండ్, హైప్ వంటి ఆధునిక పదాలను ఉపయోగిస్తూ ప్రేమలోని మధురానుభూతులను, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా కడలి సత్యనారాయణ సాహిత్యం అందించారు. శాండిల్య పిసపాటి అందించిన స్వరాలు పాట స్థాయిని పెంచాయి.

సంగీత దర్శకుడి కామెంట్స్

"ఈ మమ్మా మియా పాట నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా, వినగానే మనసును తాకేలా రూపుదిద్దుకుంది" అని సంగీత దర్శకుడు శాండిల్య పిసపాటి తెలిపారు. తుషార నిలయ, శాండిల్య పిసపాటి కలసి పాడిన ఈ మెలోడీ గీతం శ్రోతలను ప్రస్తుతం అలరిస్తోంది.

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు

ఇదిలా ఉంటే.. ఫీల్ గుడ్ సినిమాలో చిత్రంలో సుచిత్, అదితి త్రిపాఠితో పాటు రావూరి ప్రియాంక, లికిత్, రణధీర్ వాసుదేవ్, సాయిఫణి, దివ్య మోహన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను దయానంద్ పర్యవేక్షిస్తుండగా, మహికాంత్ ఛాయాగ్రహణం అందించారు.

త్వరలో విడుదల తేది ప్రకటన

ప్రస్తుతం ఫీల్ గుడ్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే ఫీల్ గుడ్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

అంచనాలు పెంచేసిన మమ్మా మియా

'మమ్మా మియా' పాట విడుదలవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయని.. ఫీల్ గుడ్ చిత్రం యూత్ ఆడియన్స్‌కు బాగా దగ్గరవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి రాంగోపాల్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్‌గా, సునీత.సి కుషి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.

సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం

అలాగే, ఫీల్ గుడ్ చిత్రానికి కృష్ణం రాజు మిక్సింగ్ ఇంజనీర్‌గా వ్యవహరించగా, ప్రొడక్షన్ వ్యవహారాలను వెంకటేష్ రెడ్డి, నదీప్ దడాలా పర్యవేక్షించారు. మురళీకృష్ణ, సాయితేజ శరత్ శర్మ, వేదన వీరబత్తిని దర్శకత్వ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రచార చిత్రాల రూపకల్పనను వంశీ చేపట్టగా, పీఆర్ మార్కెటింగ్ బాధ్యతలను ఫీనిక్స్ స్టూడియోస్ నిర్వహిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More