Parnashala: సెలబ్రిటీలతో డ్యాన్స్ చేయిస్తున్న జిమ్ జిమ్ తార సాంగ్-హారర్ కామెడీ థ్రిల్లర్ పర్ణశాల నుంచి పూర్తి పాట రిలీజ్
Parnashala Jim Jim Tara Full Song Released: టాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం'పర్ణశాల' నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'జిమ్ జిమ్ తార' పూర్తి పాటను ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ ఛానెల్ ద్వారా అధికారికంగా తాజాగా విడుదల చేశారు.
Parnashala Jim Jim Tara Full Song Released: టాలీవుడ్‌లో వినూత్న ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ 'పర్ణశాల' మూవీ టీమ్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఎంతో క్రేజ్ తెచ్చుకున్న 'జిమ్ జిమ్ తార' పూర్తి పాటను తాజాగా విడుదల చేశారు.

జిమ్ జిమ్ తార సాంగ్ రిలీజ్
ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా సోమవారం (అక్టోబర్ 12) రోజున అధికారికంగా జిమ్ జిమ్ తార పాటను రిలీజ్ చేశారు. పర్ణశాల సినిమా రాకముందే ఈ ఈ పాట ఇంటర్నెట్‌ను ఊపేస్తుండటంతో, ఈ సాంగ్ పూర్తి వెర్షన్ కోసం సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విడుదలకు ముందే సోషల్ మీడియాలో మారుమోగిన బాణీ!
సాధారణంగా ఏ సినిమాకైనా ప్రమోషన్లలో భాగంగా పాటలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేయడం చూస్తుంటాం. ఈ పద్ధతికి భిన్నంగా 'పర్ణశాల' చిత్రంలోని 'జిమ్ జిమ్ తార' పాట అధికారికంగా రాకముందే సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది.
సెలబ్రిటీలు సైతం రీల్స్ చేస్తూ
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వేదికగా ఈ జిమ్ జిమ్ తార పాట ట్యూన్స్, చిన్న చిన్న వీడియో క్లిప్స్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. సాధారణ నెటిజన్లే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. కొన్ని చిత్రాల్లోనూ ఈ పాట ట్యూన్‌ను ప్రస్తావించడం ఈ పాట సాధించిన క్రేజ్‌కు అద్దం పడుతోంది.
హారర్ కామెడీగా రూపుదిద్దుకుంటున్న 'పర్ణశాల'
ఇకపోతే ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై పర్ణశాల సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తుండగా.. మంచి వెంకట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. హారర్ కామెడీ కథాంశానికి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను జోడించి విభిన్నమైన రీతిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా తగ్గకుండా పర్ణశాల చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలుపుతున్నారు. చిన్న, మధ్య తరహా సినిమాలకు పాటలు, సోషల్ మీడియా ట్రెండింగ్ ఎంతటి ప్రధాన బలమో ఈ జిమ్ జిమ్ తార సాంగ్ నిరూపించింది.
అంచనాలను పెంచుతున్న ప్రమోషనల్ స్ట్రాటజీస్
అధికారికంగా విడుదలైన 'జిమ్ జిమ్ తార' పూర్తి పాట శ్రోతలను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ పాట తెచ్చిపెట్టిన విపరీతమైన ప్రచారం రాబోయే రోజుల్లో 'పర్ణశాల' చిత్రానికి థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించిపెడుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1: 'జిమ్ జిమ్ తార' పాట ఏ సినిమాలోనిది?
A1: ఈ పాట వై.జి. భరత్ దర్శకత్వంలో వస్తున్న 'పర్ణశాల' చిత్రంలోనిది.
Q2: 'పర్ణశాల' పాటల హక్కులను ఏ సంస్థ సొంతం చేసుకుంది?
A2: ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
Q3: 'పర్ణశాల' సినిమాను ఏ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు?
A3: ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Q4: ఈ సినిమా ఏ జానర్‌లో రూపుదిద్దుకుంటోంది?
A4: హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


