Niu Lai Collection: 85 వేలతో సినిమా, 160 కోట్ల కలెక్షన్స్- యూట్యూబ్ చూసి తల్లికొడుకులు తీసిన మూవీ- కలిసొచ్చిన ట్రోలింగ్!

Niu Lai Worldwide Box Office Collection: ఓ తల్లి, కొడుకు కేవలం రూ.85 వేలు బడ్జెట్‌తో తీసిన నియూ లాయ్ యానిమేషన్ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా అనూహ్య ప్రచారం పొందిన ఈ మూవీ 3 వేల రెట్ల ప్రాఫిట్‌తో అత్యధిక లాభాలు సాధించిన సినిమాగా నిలిచింది.

Published on: Aug 20, 2026, 11:48:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Niu Lai Worldwide Box Office Collection: సాధారణంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే వందల కోట్ల బడ్జెట్, భారీ తారగణం, విస్తృతమైన ప్రచారం అవసరమని అంతా భావిస్తారు. కానీ, వీటన్నింటినీ బ్రేక్ చేస్తూ అసలు థియేటర్లలో కూడా విడుదలవుతుందో లేదో అనుకున్న ఒక చిన్న యానిమేషన్ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని సరికొత్త రికార్డును నెలకొల్పింది.

85 వేలతో సినిమా, 160 కోట్ల కలెక్షన్స్- యూట్యూబ్ చూసి తల్లికొడుకులు తీసిన మూవీ- కలిసొచ్చిన ట్రోలింగ్!
85 వేలతో సినిమా, 160 కోట్ల కలెక్షన్స్- యూట్యూబ్ చూసి తల్లికొడుకులు తీసిన మూవీ- కలిసొచ్చిన ట్రోలింగ్!

85 వేల బడ్జెట్

కేవలం ఒక వెయ్యి డాలర్లతో (మన భారతీయ కరెన్సీలో రూ.85 వేల నుంచి రూ. లక్ష లోపు) నిర్మించిన 'నియూ లాయ్' (Niu Lai) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఆవు దూడ కథ.. ట్రోలింగే అసలైన ప్రచారం!

'నియూ లాయ్' అంటే తెలుగులో "ఆవు వస్తోంది" అని అర్థం. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ చైనీస్ యానిమేషన్ కథ ఒక కొత్తగా పుట్టిన ఆవు దూడ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రేమ, నమ్మకం, బాధ్యత, త్యాగం వంటి విలువలను తల్లి ఆవు తన బిడ్డకు ఎలా నేర్పించిందనేదే ఈ సినిమా ప్రధానాంశం.

తొలి 10 రోజుల్లో ఈ నియూ లాయ్ సినిమా సాధించిన వసూళ్లు కేవలం 7,000 యువాన్లు (దాదాపు రూ.85 వేలు) మాత్రమే. సరిగా ప్రేక్షకులు లేక ఆగస్టు 15 నాటికి చైనా వ్యాప్తంగా కేవలం 10 థియేటర్లకే ఈ సినిమా పరిమితమైంది.

కలిసొచ్చిన ట్రోలింగ్, ఒక్కరోజే లక్ష యువాన్ల టికెట్లు

అయితే చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'వేబో' (Weibo) లో ఈ సినిమా యానిమేషన్ నాణ్యత ఎంత దారుణంగా ఉందో చూపిస్తూ నెటిజన్లు మీమ్స్, వీడియాలు షేర్ చేయడం ప్రారంభించారు. "ఈ సినిమా ఎంత అధ్వానంగా ఉందో స్వయంగా థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే" అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ఆశ్చర్యకరంగా ఈ ట్రోలింగే సినిమాకు ఉచిత ప్రచారంగా మారింది. సినిమాను చూసి నవ్వుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఆగస్టు 16న ఒక్కరోజే లక్ష యువాన్ల టికెట్లు అమ్ముడవ్వగా, ఆ తర్వాత కలెక్షన్లు ఆకాశాన్ని తాకాయి.

చైనా బాక్సాఫీస్ రేసులో ఐదో స్థానానికి

చైనా డైలీ బాక్సాఫీస్ రేసులో ఐదో స్థానానికి చేరుకుని, ఇప్పటివరకు 20 మిలియన్ యువాన్లకు (సుమారు 3 మిలియన్ డాలర్లు = రూ. 28 కోట్ల 67 లక్షలు) పైగా రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ముగింపు నాటికి 135 మిలియన్ యువాన్ల (దాదాపు 20 మిలియన్ డాలర్లు లేదా రూ.160 కోట్లు) వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

తల్లి, కొడుకుల ఐదేళ్ల కష్టం!

హాలీవుడ్ హారర్ బ్లాక్‌ బస్టర్లు 'పారానార్మల్ యాక్టివిటీ', 'అబ్సెషన్' చిత్రాల రికార్డులను అధిగమించి, పెట్టిన పెట్టుబడికి ఏకంగా 3,000 రెట్ల లాభాన్ని తీసుకొచ్చి చరిత్రలోనే అగ్రస్థానంలో నిలిచింది నియూ లాయ్ సినిమా. 34 ఏళ్ల ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ జిన్ యుమెంగ్, ఆయన తల్లి సన్ లిఫాంగ్ కలిసి ఐదేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

వీరికి యానిమేషన్, స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ డబ్బింగ్‌లలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదు. యూట్యూబ్, ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నేర్చుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సన్ లిఫాంగ్ స్వయంగా పాటలు, స్క్రీన్‌ప్లే రాశారు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన నియూ లాయ్ మూవీ పోస్ట్
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన నియూ లాయ్ మూవీ పోస్ట్

ఎమోషన్‌తో బయటకు రావడం

నేటి కృత్రిమ మేధ (AI) యుగంలో, సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఒక తల్లి, కొడుకు పడ్డ కష్టం, వారి ప్రామాణికమైన ప్రయత్నం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సోషల్ మీడియా మీమ్స్ చూసి నవ్వుకోవడానికి వచ్చిన ప్రేక్షకులు, థియేటర్లలో సినిమా భావోద్వేగాలకు కనెక్ట్ అయి బయటకు వస్తుండటం ఈ చిత్రం సాధించిన అసలైన విజయం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More